అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.. శాసనసభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.. కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది.. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు… ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు..
రూ.48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు మంత్రి అచ్చెన్నాయుడు.. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి.. ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడుతున్నాం.. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తించినట్టు పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా.. బడ్జెట్ కేటాయింపులను ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బాల సంజీవని ప్లస్ కోసం రూ.1,163 కోట్లు.. మత్స్యకార భరోసా కోసం రూ.450 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్కాలర్‌షిప్పుల కోసం రూ.337 కోట్లు.. స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు.. అన్నదాత సుఖీభవ కోసం రూ. 6,300 కోట్లు.. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు రూ. 62 కోట్లు.. ధరల స్థికరణ నిధి కోసం రూ.300 కోట్లు.. హంద్రీనీవా, ఉత్తరాంధ్ర సృజన స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు.. జల్‌జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు.. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు కేటాయింపులు జరిగాయి..
మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామయ్యపట్నం అలాగే భోగాపురం పోర్టు, విజయవాడ విమానాశ్రయాలకు రూ.605 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది ఏపీ ప్రభుత్వం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 10కోట్లు .. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం రూ.101 కోట్లు.. ఎన్టీఆర్ భరోసా కోసం రూ.27,518 కోట్లు.. ఆదరణ పథకం కోసం వెయ్యి కోట్లు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం రూ.3,486 కోట్లు.. తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు.. దీపం 2.0 కోసం రూ.2,601 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు..
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లుగా సమర్పించారు ఆర్థిక మంత్రి పయ్యావుల.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లుగా ఉండగా.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది. ఇక, అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లు.. రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు కేటాయించింది ప్రభుత్వం..
2024 నుంచి ఆర్థిక వ్యవహారాలను గాడి పెడుతున్నాం అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ.23,500 కోట్ల బకాయిలను చెల్లించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆయన.. మేం రూ.2,790 కోట్లను మున్సిపాలిటీలకు చెల్లించామని వెల్లడించారు..
శ్వేతపత్రాల ద్వారా ఆర్థిక పరిస్థితిని ప్రజలకు తెలియజేశాం అన్నారు మంత్రి పయ్యావుల.. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం.. గత పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేదన్నారు.. సామాన్యుల సంతోషమే.. రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పారని గుర్తు చేశారు
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు.. గత ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించింది.. వైసీపీ పాలనలో ఆర్థిక అరాచకం జరిగిందన్నారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్ను మంత్రి పయ్యావుల
సీఎం చంద్రబాబు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది.. బడ్జెట్ 2025-26కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కుబడ్జెట్ ప్రతులు అందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్