ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మూడు రోజుల పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంల నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు..
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్‌లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్..
టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లు, యూడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ రాత్రిలోగా వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్‌లో ఉన్న అన్నిబాండ్లను లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆన్లైన్లో బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన టీడీఆర్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్ట్‌ల విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది.. కుప్పం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి పరిస్థితిపై చంద్రబాబు నాయుడు.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి.. బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్.. కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని ఎద్దేవా చేసిన ఆయన.. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదని సూచించారు.. అయితే, ప్రభాకర్ రెడ్డి వయసుకు తగినట్లుగా మాట్లాడాలని పేర్కొన్నారు..
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగు చూసింది.. అంతేకాదు.. వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి.. అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్న ఆయన.. ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందన్నారు.. ఒక వేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయని తెలిపారు..
స్వర్ణాంధ్ర నా సంకల్పం.. ఇప్పుడు విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజన్ 2020 అంటే అప్పట్లో అందరికి అర్ధం కాలేదు.. కానీ, ఇప్పుడు అర్థం అవుతోందన్న ఆయన.. ఇప్పుడు తాను విజన్ 2047 కోసం పనిచేస్తున్నాను అన్నారు.. విజయవాడలో గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని 42 ఊర్లలో దత్త క్షేత్ర నాద యాత్ర- 2025ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణల పేరుతో మొత్తం 12 నియోజకవర్గాలకుగానూ 11 చోట్ల సిట్టింగ్‌లను మార్చేసింది వైసీపీ. అది వికటించి గట్టి పట్టున్న జిల్లాలో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టు కావాల్సి వచ్చింది. ఇక ఫలితాల తర్వాత కొందరు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇక ఇటీవల పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టిన అధినేత జగన్ మార్పులు చేయటం మొదలు పెట్టారు.