Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు.. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. మార్చి 12వ తేదీన అంటే.. ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి.. ఆ నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (b), రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించింది సీఐడీ… కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే, కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయ సాయిరెడ్డిపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కాకినాడ సీ పోర్టు షేర్ల వ్యవహారంలో మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీఐడీ.. ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు..
Read Also: PM Modi: సునీతా విలియమ్స్‌కి ప్రధాని మోడీ లేఖ.. ఏమన్నారంటే..
కాగా, గత విచారణలో కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సీఐడీ అధికారులు.. 12వ తేదీన ఉదయం 11 నుంచి దాదాపు 3.30 గంటలపాటు సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు.. కేవీ రావు ఫిర్యాదు మేరకు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, శ్రీధర్, అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాపై కేసు నమోదైన విషయం విదితమే.. ఇక, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. అరబిందో వ్యాపార విషయాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాను.. నా కుమార్తెను వారికివ్వడం తప్ప, అరబిందో సంస్థతో నాకు ఆర్థిక సంబంధాలు లేవని చెప్పాను అని.. విక్రాంత్ రెడ్డి గురించి అడిగితే సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసని చెప్పా.. రూ.500 కోట్ల లావాదేవీలకు సంబంధించి విక్రాంత్ రెడ్డే చేశారని, చాలా మంది సాక్షులు చెప్పినట్లు సీఐడీ అధికారులు నన్ను అడిగారని.. విక్రాంత్ రెడ్డి కలిసే నగదు బదిలీ చేశారా? అని ప్రశ్నించారు. అలాగే నాకూ ఎలాంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు తేల్చిచెప్పా.. నన్ను ఉద్దేశపూర్వకంగానే ఒక అధికారికి ఈ కేసులో ఇరికించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే..