మంత్రి వర్గ సమావేశంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. కానీ, ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. దీంతో, త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు…
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు..
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. అందులో తీసుకున్న నిర్ణయాలను…
కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు […]
కృష్ణాజిల్లాలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల దేహ దారుఢ్య పరీక్షలో అపశృతి చోటుచేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో పడిపోయిన యువకుడు... చికిత్స అందిస్తుండగా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందాడు..
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో విపరీతంగా భూ సంబంధ సమస్యలు పెరిగిపోయాయి.. రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణంగా పేర్కొన్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చించారు..
పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు..
రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు.. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు..