Off The Record: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వృధాగా పోయే ఫ్లైయాష్.. రెండు పార్టీల మధ్య వైరానికి దారి తీసింది. ఆ రెండు కుటుంబాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవే. కాంట్రాక్ట్ పనుల విషయంలో ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటున్నారు. ఎంతవరకైనా వెళ్తాం.. తగ్గేదేలే అంటోంది జేసీ వర్గం. మా ప్రాంతంలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పొలిటికల్ హీట్ పెంచారు. సీఎం చంద్రబాబు హెచ్చరించినా ఇరువురు నేతలు తగ్గలేదు. చివరకు […]
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి...ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవు పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జనసేన పార్టీ నేతలు అన్నీ తామై వ్యవహారిస్తూ ఫుల్ జోష్ నింపారు.
బెజవాడ నగరపాలక సంస్థలో మేయర్కు...పదవీగండం తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు వైసీపీకి 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం దాని 38కి పడిపోయింది. వీరిలో మరో 10 మందికి పైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 64 మంది కార్పొరేటర్లున్న బెజవాడ కార్పొరేషన్లో...మేయర్ పీఠానికి 33 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారిలో ఏడుగురు వెళ్లిపోతే...మేయర్ కుర్చీ ఆ పార్టీకి దూరమైనట్టే. ఇప్పటికే ఐదుగురు టీడీపీలోకి, నలుగురు జనసేన, బీజేపీలో ఇద్దరు చేరిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటించింది.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఏపీ మంత్రులు.. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను విజయవంతంగా అమలుచేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు అభినందనలు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. మూడు రోజుల పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ప్లీనరీ నిర్వహణపై పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంల నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు..
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొంది ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీపీఎల్లో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలకు బీమా చేయించి వైద్య సేవలు అందించనుంది ప్రభుత్వం.. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు మంత్రి సత్యకుమార్..
టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లు, యూడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ రాత్రిలోగా వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్లో ఉన్న అన్నిబాండ్లను లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆన్లైన్లో బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన టీడీఆర్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు..