TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త అందించింది. ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖల స్వీకరణ ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. సోమ, మంగళవారాలలో విఐపి బ్రేక్ దర్శనాలు.. బుధు, గురువారాలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలపై జారీ చేయనుంది టీటీడీ. ఇదే సమయంలో మరోవైపు ఏపీ ప్రజా ప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు చెప్పింది.. ఇప్పటి వరకు వారానికి నాలుగు రోజులు మాత్రమే సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటున్న టీటీడీ.. ఇకపై ఏపీ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సిఫార్సులేఖలపై ఆదివారం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
Read Also: Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?
కాగా, తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖల స్వీకరణ పై టీటీడీ సానుకూల నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను తిరుమలలో పరిగణలోకి తీసుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లడం.. వెంటనే ఏపీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖలపై వారానికి రెండు రోజులు బ్రేక్ దర్శనాలు.. మరో రెండు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు జారీ చేయాలంటూ టీటీడీని ఆదేశించడం.. అదే విషయాన్ని తెలంగాణ సీఎంకు తెలియజేయడంతో తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దీనితో టీటీడీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను జనవరి 20 తర్వాత నుంచి పరిగణలోకి తీసుకుంటామంటూ ముందస్తుగా వారికి సమాచారం కూడా అందించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా తిరుమలలో తమ ప్రతినిధిని ఓఎస్డీగా నియమించింది. ఇక అన్ని సానుకూలంగా జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో.. టీటీడీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలు స్వీకరణ వాయిదా వేస్తూ వచ్చింది. ఇక రెండు రోజుల క్రితం శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అయితే ఏకంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు టీటీడీకి అల్టిమేటం ఇచ్చేశారు. రానున్న వేసవిలో తమ సిఫార్సు లేఖలు తెలంగాణ ప్రజలకు జారీ చేస్తున్నామని వాటిని టీటీడీ పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ తిరుమలకు చేరుకొని టీటీడీతో తేల్చుకుంటామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడం రెండు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన శ్రీనివాస కళ్యాణం సందర్భంగా టిటిడి అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖల స్వీకరణను 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేసింది టీటీడీ..
Read Also: Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?
మరోవైపు ఏపీ ప్రజాప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు పంపింది. ఇప్పటివరకు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వారి సిఫార్సులేఖలపై బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుండగా.. ఇకపై ఆదివారం రోజు కూడా వారి సిఫార్సులేఖలపై బ్రేక్ దర్శనాలు జారీ చేసేందుకు టీటీడీ అంగీకరించింది. మొత్తంగా టీటీడీ ప్రకటనతో ప్రజాప్రతినిధులకు ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ ఎలా సర్దుబాటు చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.