YSR Kadapa District: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్‌ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు.. కాగా, ఉమ్మడి ఏపీకి రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ దుర్ఘటనలో మరణించారు. ఈ నేపథ్యంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్‌ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పలు ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్ పేరు పెట్టడంతో పాటు.. వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్న పేరును అందులోని కడపను తీసి వేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు.. అయితే, ఇప్పుడు కూటమి సర్కార్.. వైఎస్‌ఆర్ జిల్లాను మళ్లీ వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది..
Read Also: Post Office RD: రోజుకు కేవలం రూ.100 పొదుపుతో రూ.2.14 లక్షలు సంపాదించండి.. ఎలా అంటే!
ఇక, ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లును అఫ్రూవ్ చేసింది.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింప జేయనున్నారు.. సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు… E1 జంక్షన్ నుండి సీఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400KV DC లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. బుడమేరు డివిజన్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. రాజధానిలో భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వైఎస్‌ఆర్ తాడిగడప పురపాలిక పేరును తాడిగడపగా మారుస్తూ కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు కూడా ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్..