తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా... అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ... ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో.... కుర్చీ కుస్తీ మొదలైందా అంటే.... అవును, అలాగే కనిపిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నడుస్తున్నాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికన్న చర్చ మొదలైంది. పురందేశ్వరినే తిరిగి కొనవసాగిస్తారని ఓ వర్గం అంటుంటే...మరో వర్గం మాత్రం... అంత సీన్ లేదమ్మా, ఈసారి కొత్త వాళ్ళకే ఛాన్స్ అంటూ దీర్ఘాలు తీస్తోందట.
కవిత సీఎం.. సీఎం కవిత.. అంటూ చేసిన స్లోగన్స్ పార్టీలో వెయ్యి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయట. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది అవసరం లేదు. పార్టీ అధికారంలో లేదు, అధ్యక్షుడు కేసీఆర్ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ... ఆయన వారసత్వ వ్యవహారమే చాలా రోజులుగా నలుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఎవరంటూ చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అసలదేం ప్రశ్న?
బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. న్యూఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఓజీ.. ఓజీ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. అయితే, వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు పవన్.. తనను పని చేసుకోనివ్వండి అని గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి అదే అనుభవం ఎదురైంది.. పవన్ స్పీచ్ సమయంలో OG.. OG.. అంటూ నినాదాలు చేశారు అభిమానులు.. అయితే.. OG.. OG.. కంటే శ్రీశ్రీ.. శ్రీశ్రీ…
ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది.
విజయవాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 35వ విజయవాడ బుక్ ఫెస్టివల్‌ను ప్రారంభించారాయన.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ బుక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పుస్తకాలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీవితంలో నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలు.. కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా వెనుకాడను.. కానీ, పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను అంటూ బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు..
మంత్రి వర్గ సమావేశంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వచ్చిందట.. కానీ, ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు.. దీంతో, త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, మనకు ఓపిక ఉంది.. ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు…
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు.. ఈ నెల విశాఖ పర్యటన ఖరారైనట్టు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం అందించారు.. 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు చేరుకోనున్నారు మోడీ.. అయితే, ఈ నెల 8 తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రుల కమిటీని నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు..