నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్..
ఆంధ్రప్రదేశ్లో తప్పుడు పత్రాలతో వేలాది మంత్రి ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తప్పుడు మార్గంలో మెడికల్ సర్టిఫికెట్లు పొంది.. వాటితో దరఖాస్తు చేసుకుని పెన్షన్ల రూపంలో ప్రభుత్వ సొమ్ము నొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.. అయితే, ఏపీలో 8 లక్షల 18 వేల పెన్షన్ల కు సంబంధించి వేరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది..
తిరుపతి ఘటనపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. మానవ తప్పిదం వల్లే తిరుపతిలో ఆరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారన్నారు. దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టే ఈ ఘటన జరిగిందని.. అధికారులపై కోపాన్ని చూపించిన చంద్రబాబు ఏం సాధించారని నిలదీశారు.. అధికారులను తిట్టి తనపనై పోయిందని చంద్రబాబు భావిస్తున్నాడని.. కానీ, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఇలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశం ఉందన్నారు. ఏడు కొండలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు అంబటి…
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు.
రోజు మరో సెల్ ఫోన్ గుర్తించారు జైల్ అధికారులు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సెల్ ఫోన్లు లభ్యం కావడంపై దృష్టిసారించారు అధికారులు.. హోం మంత్రి వంగలపూడి అనిత సెంట్రల్ జైలును పరిశీలించిన మూడు రోజులలో మరో సెల్ ఫోన్ అధికారులకు దొరకడం చర్చగా మారింది.. ఇక, సెల్ఫోన్ను గుర్తించిన జైలు అధికారులు.
కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూస్తాం అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ భరోసాగా ఉంటాం అని హామీ ఇచ్చారు.. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి.. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామని హెచ్చరించారు..
సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు.. బయట నుంచి ఎవరైనా దాడికి ప్రయత్నిస్తే ధీటుగా ఎదుర్కోవడానికి కౌంటర్ యాక్షన్ బృందాలు సిద్ధంగా ఉండనున్నాయి.. NSG, ఎస్ఎస్జీ, స్థానిక […]
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోంది.. ఇంటర్ విద్య లో కీలక మార్పులు వస్తాయి.. పాఠ్య పుస్తకాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.. ఇక మొదటి సంవత్సరం ఖచ్చితంగా పాస్ అవ్వాలన్న నిబంధనకు మినహాయింపు ఇవ్వబోతున్నారు.