మోడీ పర్యటనలో రోడ్డు షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.. సుమారు లక్షమంది తో ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దాదాపు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో కొనసాగనుంది.. ఓపెన్ టాప్ వెహికల్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు.
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు..
అమెరికన్ కార్నర్ హైదరాబాద్ సహకారంతో మహిళల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో నిర్వహించిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI Bootcamp లో సీనియర్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించారు.
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రారంభిస్తారు.
ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం నాలుగు గంటలకు మోడీ విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో చేస్తారు. ఈ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. బహిరంగసభ జరిగే వేదికను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు.