V. Srinivasa Rao: ఇప్పుడు అంతా డీలిమిటేషన్‌పై చర్చ సాగుతోంది.. ముఖ్యంగా.. సౌత్ ఇండియా రాష్ట్రాలకు డీలిమిటేషన్‌తో ఎక్కువ నష్టం జరుగుతోందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. దీనిపై తాజాగా చెన్నై వేదికగా అఖిలపక్ష సమావేశం జరగడం.. డీలిమిటేషన్ విధానాలను తప్పుబట్టిన విషయం విదితమే.. అయితే, డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల నష్టం కలుగుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రానికి లేఖ రాయడం సంతోషం అన్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. డీలిమిటేషన్‌పై పార్లమెంటులో మాట్లాడాలనడం గోడ మీద పిల్లి వాటం అంటూ ఎద్దేవా చేశారు.. బీజేపీని కాదనలేక సర్కస్ ఫీట్లు వల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు.
Read Also: Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!
మహిళలకు ఆశ చూపించి డీలిమిటేషన్ జరిపితే మంచిది అనడం సరైంది కాదని హితవుచెప్పారు శ్రీనివాసరావు.. జనాభా పెరిగిన రెండు మూడు రాష్ట్రాలకి తప్ప మరే రాష్ట్రాలకు దీనివల్ల ఉపయోగం లేదన్నారు.. ఇక, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి చాలా మంది సౌత్ ఇండియా రాష్ట్రాలకు వలసలు వస్తున్న పరిస్థితి ఉందన్నారు.. అయితే, బీజేపీ ప్రాతినిథ్యం లేని రాష్ట్రాలను బలహీనం చేసే చర్య ఈ డీలిమిటేషన్ అని ఆరోపించారు. డీలిమినేషన్ లో ప్రో రేటా అనేది ఆ రాష్ట్రాలలో సీట్ల ఆధారంగా జరగాలి.. కానీ, జనాభా ప్రాతిపదికన చేయడం అశాస్త్రీయం అన్నారు.. భారతదేశంలో విభజన వాదం వస్తే… దానికి కారణం బీజేపీనే అవుతుందన్నారు.. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బీజేపీయేతర పార్టీలు హాజరు కావాలని కోరారు సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు..