ఉద్యోగులకు తీపికబురు.. ఖాతాల్లో జమ అవుతోన్న నిధులు..
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. GLI, GPF బకాయిలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం 6 వేల 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విడుదల అవుతున్నాయి.. నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.. రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు.. ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.. బకాయిలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు, ఉద్యోగులు..
స్కూళ్లలో వాటర్ బెల్ తప్పనిసరి.. సీఎం కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో ఎండ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేన్‌మెంట్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని స్పష్టం చేశారు.. ఎండ వేడిమి, హీట్ వేవ్స్ సమాచారాన్ని మొబైల్ అలెర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు సీఎం చంద్రబాబు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని సూచించారు.. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం జరగాలని ఆదేశించారు.. ఇక, ఎండల తీవ్రత దృష్ట్యా.. పాఠశాలల్లో వాటర్ బెల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా స్కూళ్లలో వాటర్ బెల్ మోగించాలని తెలిపారు.. ఇక, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు, వేసవిలో తరచూ అడవుల్లో మంటలు వ్యాపించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో.. అడవుల్లో అగ్నిప్రమాదాలుపై అప్రమత్తంగా ఉండాలన్నారు.. డ్రోన్లతో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రధానంగా వీటిపైనే ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధమైంది.. వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధమైంది.. వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య, పశుగ్రాసం, పశువులకు తాగునీటి లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పధకం పనులు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. పి.ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక చర్చ జరగనుంది.. రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలు.. పాలనలో మార్పులు.. పీ 4 సంక్షేమ పథకాలు ప్రధాన అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. పీఎం సూర్య ఘర్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లపై రూఫ్ టాఫ్ లు ఏర్పాటు చేయడంపై కూడా ప్రభుత్వం ఈ సదస్సులో ఫోకస్ పెట్టింది.. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కార్యాచరణ పై నివేదికలు సిద్ధం అయ్యాయి. ప్రతి మూడు నెలలకు ఒక సారి కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే కుటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రభుత్వం.. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు మరోసారి కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది.. 15 శాతం వృద్ధే లక్ష్యంగా రానున్న ఏడాది కాలానికి రాష్ట్రంలోని 26 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలను రెండు రోజుల పాటు అమరావతిలో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించనున్నారు.. రెండు రోజుల ఈ సమావేశంలో మొదటి రోజు 9,రెండో రోజు 17 జిల్లాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తారు.. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటెషన్ ఇవ్వనున్నారు.. ప్రతి జిల్లాకు 20 నిమిషాలు కేటాయించారు.. ఇందులో 10 నిమిషాలు కార్యాచరణ ప్రెజెంటేషన్, ఐదు నిమిషాలు సమస్యల వివరణ, ఇంకో ఐదు నిమిషాలు వాటిపై చర్చించనున్నారు.. తమ జిల్లాల్లో వివిధ సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు.
కేబినెట్ విస్తరణ అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని అంచనా వేయబడుతోంది. గత కొన్ని రోజులుగా కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం, ఏయే నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టాలి అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావొస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడకపోవడం అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు కీలక గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SLBC సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సహాయక చర్యలను వేగంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి, సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను (చీఫ్ సెక్రటరీ) ఆదేశించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, SLBC సహాయక చర్యలపై తాజా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యల పురోగతిని అధికారులు సీఎం ముందు వివరించారు. రాష్ట్రంలో సహాయ చర్యలు నిరంతరంగా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. సహాయక చర్యలను సమర్థంగా సమన్వయం చేయడం, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని చీఫ్ సెక్రటరీ (CS) ను సీఎం రేవంత్ ఆదేశించారు. దీనివల్ల సహాయ చర్యలు మరింత సత్వరంగా జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్పందన తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్‌లో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి ఘటన గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. తనను రక్షించుకునేందుకు రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది,” అని మండిపడ్డారు. “మేము ఎన్నిసార్లు మహిళల భద్రతపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది అదే నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. ఇప్పుడు మరో యువతి దాడికి గురైంది,” అని ఆందోళన వ్యక్తం చేశారు.
కునాల్ కమ్రా సంచలన ప్రకటన.. తన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని వ్యాఖ్య
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు… ముంబైలోని స్టూడియో, క్లబ్‌పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కునాల్‌పై శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కునాల్ కమ్రాతో సహా దాడికి పాల్పడ్డ శివసేన కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ వివాదంపై కునాల్ కమ్రా స్పందించారు. తన వ్యాఖ్యలకు ఏ మాత్రం చింతించడం లేదని ముంబై పోలీసులకు కునాల్ కమ్రా తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ముంబై పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కునాల్ కమ్రా తమిళనాడులో ఉన్నారు. మహారాష్ట్రలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ముంబై పోలీసులు.. కునాల్ కమ్రాను స్పందించారు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు చింతించడం లేదని చెప్పినట్లుగా ముంబై పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. తనకు ప్రతిపక్షాలు డబ్బులిచ్చి మాట్లాడి ఇస్తున్నారంటూ చేస్తున్న వదంతులను కూడా కునాల్ తోసిపుచ్చారని పోలీస్ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బయటపట్టాలని కునాల్ డిమాండ్ చేసినట్లుగా చెప్పారు. ఒకవేళ న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని కునాల్ ప్రకటించినట్లుగా ముంబై పోలీస్ వర్గాలు తెలిపాయి.
కునాల్ కమ్రా వ్యాఖ్యలపై సీఎం ఫడ్నవిస్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను హాస్యానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ ఒక వ్యక్తిని అగౌరవపరచడం సరికాదన్నారు. 2024 ఎన్నికల్లో దేశద్రోహి ఎవరో మహారాష్ట్ర ప్రజలు నిరూపించారన్నారు. బాల్ థాకరే వారసత్వం ఎవరికి ఉందో ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చింది.. ఇతరుల స్వేచ్ఛను భంగపరచడానికి కాదన్నారు. రాజ్యాంగాన్ని ఎత్తు చూసి తప్పును సమర్థించుకోవడం భావ్యం కాదన్నారు.
మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 9,970 పోస్టులు.. ఇక వద్దన్నా జాబ్
రైల్వే ఉద్యోగాలకు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పలు జోనల్ రైల్వేలలో భారీగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీచేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి సడలింపు ఉంటుంది. ఈపోస్టులకు సీబీటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 19,900 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు రూ. 250 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి ప్రారంభంకానుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మే 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మహిళా క్రికెటర్ల కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా విడుదల చేసిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 16 మంది మహిళా ప్లేయర్స్ కు BCCI కాంట్రాక్ట్ ఇచ్చింది. మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్లను గ్రేడ్ A లోకి, నలుగురుని గ్రేడ్ B లోకి, మిగిలిన 9 మందిని గ్రేడ్ C లోకి చేర్చారు. ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. BCCI విడుదల చేసిన జాబితాలో గ్రేడ్ A లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. వీరు భారత జట్టుకు ప్రధాన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 50 లక్షల రూపాయలు వార్షికంగా అందజేయనున్నారు. ఇక గ్రేడ్ B లో రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ చోటు దక్కించుకున్నారు. వీరికి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కింద లభించనుంది. అలాగే గ్రేడ్ C లో యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, తితాస్ సాధు, అరుందతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, ఉమా చేత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్ ఉన్నారు. వీరికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు.
వైజాగ్ ఈసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వస్తుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో నాల్గవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ ముందుండి నడిపించనున్నాడు. అలాగే మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వైజాగ్ లోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ స్కోరింగ్‌కు చేసేందుకు అవకాశం ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఈ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌ను అభిమానులు JioHotstar ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. అలాగే, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్స్ ద్వారా టీవీలో లైవ్ టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరగగా ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 2 సార్లు విజయం సాధించగా., లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 3 సార్లు విజయం సాధించారు.
రిపోర్టర్ ప్రశ్న.. నాకేంటి ఈ టార్చర్ అంటున్న హీరో..
హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను నీ రెమ్యునరేషన్ ఎంత, యాడ్ కు ఎంత తీసుకుంటున్నారు అని ప్రశ్నించాడు. దానికి సుహాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చాడు. ‘నాకేంటిది టార్చర్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. పర్లేదు బాగానే ఇచ్చారు. కాకపోతే నేను అనుకున్న నెంబర్ రాలేదు. యాడ్స్ కూడా కూడా పర్లేదు. కానీ నా యాక్టింగ్ చూడకుండా ఇలా రెమ్యునరేషన్ గురించి అడుగుతున్నారు. నా యాక్టింగ్ గురించి అడిగితే బాగుంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇక స్పిరిట్ మూవీలో ఛాన్స్ గురించి చెప్పాడు. తనకు ఎలాంటి ఆడిషన్ కాల రాలేదని.. ఏదైనా వస్తే చెబుతానన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా నటిస్తానని.. మంచి రోల్ కోసం చూస్తున్నానని అన్నాడు.
రాజేంద్ర ప్రసాద్ దొంగ ముం* కొడుకు కామెంట్స్.. డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే?
తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని ఛలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక అతిధి పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఆయననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇక ఈ నేపథ్యంలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ఒక దొంగ ముండాకొడుకు అంటూ కామెంట్ చేశారు. క్రికెట్ ఆడమంటే పుష్ప లాగా బుజం పెట్టి రీల్స్ చేశాడనిz డేవిడ్ వార్నరు ఇదేనా వార్నింగ్ అంటూ కామెంట్ చేశారు.