ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. శనివారం గుంటూరు, కడప జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు..
జేసీ వ్యవహారంలో తాడిపత్రి అర్బన్ సీఐ, ఓ వ్యక్తి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. వేరేవాళ్లతో ఫోన్ చేయించి జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను బెదిరిస్తున్నాడన్న రాంపులయ్య అనే వ్యక్తి.. తనకు జేసీ ఫోన్ నంబర్ కావాలంటూ సీఐ సాయిప్రసాద్‌ను అడగడంతో.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగిపోయింది.. చివరకు అసభ్యపదజాలంతో దూషించుకోవడం వరకు వెళ్లింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది... ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది..
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని దానిపైనే రాసి ఉంటుంది.. అయినా.. కొందరు దానికి బానిసగా మారిపోతారు.. కొందరు సిగరెట్లు, మరికొందరు బీడీలు.. ఇంకా కొందరు చుట్టలు ఇలా.. లాగిస్తుంటారు.. వీటితో అనారోగ్య సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచినవాళ్లు ఎందరో ఉంటారు.. కానీ, ధూమపానానికి బానిసైన ఓవృద్ధుడు చివరకు తను కాలుస్తున్న సిగరెట్ మంచానికి అంటుకొని అగ్నిప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..