Vice MPP Election: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. జడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగుతున్నాయి.. అయితే, ప్రకాశం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది.. పుల్లలచెరువు మండల పరిషత్‌లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది.. ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు.. వైసీపీ ఎంపీటీసీ నాగేంద్రమ్మ భర్త పొలయ్య మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేశారట.. పూర్తి వివరాల్లోకి వెళ్లే పుల్లలచెరువు మండలంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు నాగేంద్రమ్మ.. అయితే, ఆమె భర్త పోలయ్య.. ముటుకుల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే.. నీ ఉద్యోగం తీసేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టుగా తెలుస్తోంది.. దీంతో, తన భార్యను వైసీపీకి ఓటు వేయవద్దు టీడీపీకి ఓటు వేయాలని భర్త ప్రాధేయపడ్డాడట.. వైసీపీకి ఓటు వేస్తే నా ఉద్యోగం పోతుందని తెలిపాడట.. అయితే మండల పరిషత్ ఎన్నికల్లో భర్త పోలయ్య మాట వినకుండా నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేయడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైనట్టు తెలుస్తోంది..
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
అయితే, వైసీపీ నాయకులు నాగేంద్రమ్మకు బుజ్జగించి వైసీపీకి ఓటు వేయించుకున్నారని తెలుస్తుంది.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ నాగేంద్రమ్మ తనను భర్త పోలయ్య ఏమైనా అంటాడేమోనన్న భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.. మరోవైపు, పోలయ్యను కలిసి వైసీపీ నాయకులు.. ఆయన్ని బుజ్జగించి నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారట.. దీంతో, సమస్య పరిష్కారం అయ్యింద.ఇ. పుట్టింటికి వెళ్లిన ఎంపీటీసీ నాగేంద్రమ్మను ఈ రోజు వెళ్లి భర్త పోలయ్య తీసుకువస్తాడని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఏది ఏమైనా మండల పరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య అగ్గిరాజేసి ఆగదాన్ని పెంచినట్టు అయ్యింది.. కాగా, పుల్లలలచెరువు మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి విజయం వరించింది.. మొత్తం 15 స్థానాల్లో ఒక వ్యక్తి హాజరు కాకపోవడంతో 14 సభ్యులకు సంఖ్య బలం పడిపోయింది.. వైసీపీ 7.. టీడీపీ 7 ఓట్లతో చేరి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠగా ఎన్నికల ప్రక్రియ ఏర్పడింది.. అధికారులు డ్రా తీయడంతో వైసీపీ అభ్యర్థి లింగంగుట్ల రాములు విజయం సాధించారు.