Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చేనా..?
- వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు..
- సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్..
- నేడు తీర్పు ఇవ్వనున్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.. దీంతో, అసలు వంశీకి బెయిల్ వస్తుందా? మరోసారి షాక్ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం రోజు సీఐడీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే కాగా.. మరోవైపు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్‌పై నేడు తీర్పు రానుంది.. ఇక, సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. దీంతో, వంశీకి ఈసారైనా బెయిల్ వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: Nirmal: ప్రేమ వివాహం.. ఒకే మండపంలో ఇద్దరి యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
కాగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడ 12 అదనపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వంశీ పిటిషన్ డిస్మిస్ చేసిన విషయం విదితమే.. ఇక, గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఏ71గా ఉన్నారు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై మంగళవారం రోజు కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మానవతా కోణంలో బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో విన్నవించారు.. అయితే, గురువారం రోజు ఆ బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు నమోదైన కేసులో వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13వ తేదీన అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు.. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో నివాసం ఉంటున్న వంశీని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ తర్వాత అరెస్ట్ చేసి.. విజయవాడ తీసుకెళ్లిన విషయం విదితమే.. ఇక, కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్ తదితర సెక్షన్ల కింద వంశీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?