Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ్టితో ముగిసింది వల్లభనేని వంశీ రిమాండ్.. దీంతో, జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని కోర్టుకు తీసుకెళ్లారు గన్నవరం పోలీసులు.
Read Also: JAAT : సన్నీడియోల్ దెబ్బకి సైడవుతున్న బాలీవుడ్ సినిమాలు..
మరోవైపు.. వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.. దీంతో, అసలు వంశీకి బెయిల్ వస్తుందా? మరోసారి షాక్ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురువారం రోజు సీఐడీ కోర్టు డిస్మిస్ చేసిన విషయం విదితమే కాగా.. మరోవైపు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్‌పై నేడు తీర్పు రానుంది.. ఇక, సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. దీంతో, వంశీకి ఈసారైనా బెయిల్ వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.