Vijayasai Reddy: లిక్కర్ స్కామ్‌లో సాయిరెడ్డి సంచలన ట్వీట్.. వారి పని పట్టండి.. నేను పూర్తిగా సహకరిస్తా..
- ఏపీ లిక్కర్ స్కామ్‌పై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్..
- ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్..
- తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారు..
- ఏ రూపాయి నేను ముట్టలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్ స్కామ్ సంచలనంగా మారింది.. ఇప్పటికే సిట్ విచారణ ఎదుర్కొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కీలక సమాచారాన్ని సిట్ అధికారులకు చెప్పారు.. ఇక, రంగంలోకి దిగిన సిట్.. ఈ కేసులో కీలకంగా భావిస్తోన్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది.. సోమవారం రోజు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్.. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది.. అయితే, మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కసిరెడ్డి.. విచారణకు వస్తానంటూ ఆడియో విడుదల చేశారు.. మరోవైపు రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఇదీలా ఉంటే.. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇక, ఈ లిక్కర్ స్కామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..
Read Also: Dil Raju: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
లిక్కర్ స్కామ్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ”ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను” అంటూ ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. కాగా, సిట్ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి రాజ్ కసిరెడ్డే నంటూ వ్యాఖ్యానించారు.. మరోవైపు.. రాజ్ కసిరెడ్డి విడుదల చేసిన ఆడియోలో సాయిరెడ్డిపై మండిపడ్డారు.. లిక్కర్ కేసు వ్యవహారం తేలిన తర్వాత.. విజయసాయిరెడ్డి బాగోతం బయటపెడతానంటూ వ్యాఖ్యానించారు రాజ్ కసిరెడ్డి.. ఈ నేపథ్యంలో.. ట్వీట్‌తో మరింత రచ్చకు తెరలేపారు విజయసాయిరెడ్డి..
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!