YS Jagan: పీఏసీ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత జగన్.. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్‌లను పెట్టి.. గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆటలు పెట్టి.. ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. దీనివల్ల ప్రజలు తమ కష్టాలను, బాధలను వదిలేస్తారని అభిప్రాయం.. ఇప్పుడు మన పరిస్థితి అలానే ఉంది.. విశాఖలో 3వేల కోట్ల భూమిని ఊరుపేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు 1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. 36 వేల కోట్ల పనులను ఇప్పుడు 77 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు.
Read Also: Baba Ramdev: బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు.. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు అన్నారు వైఎస్ జగన్.. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదు అని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడంలేదు అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ జగన్.. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి.. దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబునాయుడు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు. గత ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు? అని ప్రశ్నించారు..
Read Also: ChauryaPaatam : ఐపీఎల్ టికెట్స్ తో ప్రమోషన్స్ కు తెరలేపిన చౌర్య పాఠం టీమ్
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని నిలదీశారు వైఎస్ జగన్.. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. 3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు.. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు 700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రియింబర్స్ మెంట్, వసతీ దీవెన కింద 3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్ కలుపుకుంటే 7 వేల కోట్లకు గాను 700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు.. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి