రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ..
ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో పైకి కనిపించనిది ఏదేదో జరిగిపోతోందా? గ్రూప్‌వార్ లిటరల్‌గా తెలుగుదేశం పార్టీ పరువును రోడ్డుకీడుస్తోందా? అంటే.. ఎస్....పరిణామ క్రమం అలాగే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సీనియర్ దళిత నేతగా పేరున్న కోనేటి ఆదిమూలంను ఏరికోరి పార్టీలోకి రప్పించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం.
తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. మరో 19 పెండింగ్‌లో ఉన్నాయి. కానీ... ప్రకటించిన జిల్లాల్లో సమతౌల్యం కనిపించటడం లేదన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ... దగ్గరుండి వాటిని పరిష్కరించాల్సిన ఎఐసిసి నాయకులు మాత్రం పత్తా లేకుండా పోయారట. పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని, ఓ మంత్రిని రోడ్డుకీడ్చే పని చేశారన్న ప్రచారం జరుగుతున్నా... అసలు అందులో వాస్తవం ఎంత? ఏం జరిగిందన్న సంగతిని పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో.
తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆయ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును నియమించారు. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా.. ఇంకా అనుమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం గత 10 ఏళ్లలో సంస్ద యాజమాన్యం విచ్చలవిడిగా, అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలే అన్నారు.. కానీ, కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా ఇంకా అనుమానాలు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి.. ప్రచారంలో దూకుడు పెంచారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భీఫామ్ అందుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె అశ్విత.. తండ్రి విజయం కోసం కుమార్తె తాపత్రయం పట్ల హర్షం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ…