Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి.. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాలను కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు.. అయితే, విద్యార్థులకు సులువుగా తమ ఫలితాలను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్.. మీరు ఇక్కడ క్లిక్ చేసి.. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా.. క్షణాల్లో మీ ఫలితాలను పొందవచ్చు.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇంటర్ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.. 4.88 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్, 5 లక్షలకుపైగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు.. https://tsbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ లోనూ నేరుగా ఫలితాలు తెలుసుకునే వీలుండగా.. ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్‌నంబర్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు..
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం.. క్లిక్ చేయండి..