CM Chandrababu: పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న ఏఐ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యమని స్పష్టం చేశారు.. టెక్నాలజీ వినియోగంతో రియల్‌టైమ్‌లో సేవల డెలివరీ చేయవచ్చు అని.. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తాం.. త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు..
Read Also: PM Modi: పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్ సభలో పాల్గొన్న మోడీ
పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రజలకు సేవల విషయంలో మానవీయకోణం చూపాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైమ్‌లో సేవలు అందించవచ్చు అని పేర్కొన్నారు.. ఇందుకోసం పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టాలి.. టెక్నాలజీ అనేది ప్రజల కోసం ఉపయోగపడాలని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో భారీ డేటా లేక్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాం అన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన మార్గనిర్దేశం చేశారు.. 2 Mbps ఇంటర్నెట్ కోసం ఎదురుచూసిన రోజుల నుంచి డేటా ఆధారిత పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దామన్నారు.. వేగంగా భూరికార్డుల డిజిటలైజేషన్ చేయాలన్న సీఎం చంద్రబాబు.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతుల్లో అధికంగా 75 శాతం భూసంబంధితమైనవే ఉన్నాయని తెలిపారు.. ఈ సమస్య పరిష్కారానికి త్వరితగతిన భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..