Minister Srinivas: కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.. కొప్పర్తి పారిశ్రామిక వాడను పరిశీలించారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎం.ఎస్.ఎం పార్క్‌పై అపోహలు వద్దు.. జిల్లాలోని ఏర్పాటు చేస్తాం అని స్పష్టం చేశారు.. ఐటీ పార్క్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 ఎకరాలు ఐటీ పార్క్ కోసం స్థల పరిశీలన చేస్తున్నాం అన్నారు.. పార్క్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలను ఎటువంటి పరిశ్రమలకు కేటాయించాలో పరిశీలిస్తున్నాం. ప్రైవేటు భాగస్వామ్యంతో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాం.. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు సదుపాయాల చర్చించడానికి ఇక్కడికి వచ్చా.. అన్ని శాఖల అధికారులతో కలిసి ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష చేస్తున్నాం అన్నారు.. ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మంచి మంచి కంపెనీలు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నారు పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు..
Read Also: Mukku Raju Master : ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషన్ లేదు..