ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి.. అయితే, అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్‌కు డేట్ ఫిక్స్ చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుంగా తెలుస్తోంది..
విధ్వంసకారుడే విధ్వంసం గురించి, విధ్వంసానికి నిర్వచనం గురించి చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరం అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి నిమ్మల రామానాయుడు.
గులాబీ బాస్ కేసీఆర్... ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చేశారు. నేనేదో..... ఫామ్‌హౌస్‌లో కామ్‌గా ఉన్నానని అనుకుంటున్నారేమో... కో....డ్తే...... మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారాయన.
ప్రశ్నకే.... ప్రశ్నలు ఎదురవుతున్నాయా? నిలదీస్తానన్న స్వరానికే నిలదీతలు పెరుగుతున్నాయా? ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను వైసీపీ నేతలు అడుగుతున్న తీరు చూస్తుంటే... ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ప్రభుత్వంలో ఎక్కడ తప్పు జరిగినా... తేడాగా ఏం చేసినా... ప్రశ్నిస్తా, నిలదీస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చారు పవన్.
సంక్రాంతి పండుగ తర్వాత వైసీపీ అధినేత జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని సమాచారాన్ని ఇచ్చారు.. కానీ, జగన్ జిల్లాల పర్యటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.. జిల్లాల టూర్ పై ఆయన ఇంకా ఓ స్పష్టతకు రాకపోవటమే అందుకు కారణంగా కనిపిస్తోంది.. మరి కొన్ని జిల్లాల సమీక్ష సమావేశాలు పెండింగ్ లో ఉండటంతో అవి పూర్తయిన తర్వాత ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.
ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది.. రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై జరిగిన ఈ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
కీలక నేత, మాజీ మంత్రి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్..