Minister Satya Kumar Yadav: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేవారు.. పహల్గామ్‌లో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్చగా పేర్కొన్నారు సత్యకుమార్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయం అయినా.. మా మద్దతు ఉంటుంది అని ఆగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో అక్కడ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ దాడికి తెగబడ్డారని ఆరోపించారు.. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లో ప్రశాంత పరిస్థితిని జీర్ణించుకోలేక దుష్ట శక్తులు దాడులుకు తెగబడుతున్నాయని ఫైర్ అయ్యారు..
Read Also: Uttam Kumar Reddy : తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏడాదిన్నర కృషి ఫలించింది
ఇక, సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సత్యకుమార్ యాదవ్.. అంతేకాదు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.. ఈ సమయంలో భారత్ ప్రజల ఐక్యతగా నిలబడాల్సిన సమయం ఇదే అంటూ పిలుపునిచ్చారు.. దేశ సమగ్రతకి కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..