Duvvada Srinivas: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది ఆ పార్టీ.. వైసీపీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే.. ఆయనపై వేటు పడినట్టుగా తెలుస్తోంది.. అయితే, తనపై సస్పెన్షన్ వేటు విషయంపై తొలిసారి స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Pakistan Stock Market: భారత్ దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ కుదేల్
నా ఈ స్థాయి కారణం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డియే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దువ్వాడ శ్రీనివాస్.. హోదా , గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న ఆయన.. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసాను.. పార్టీ గొంతే మాట్లాడాను.. ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డాను.. ఎంతో కష్టపడి పనిచేసిన నాకు, అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేసినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, రాజకీయ క్రీడలో నేను బలి అయ్యా నేమో అనిపిస్తుందన్నారు.. ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు..
Read Also: Addanki Dayakar: బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు?
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే అన్నారు దువ్వాడ.. స్వతంత్రుడిగా నా ప్రజల కోసం పనిచేస్తాను అన్నారు.. మరింత రెట్టింపు ఉత్సాహంతో అభిమానుల కోసం పనిచేస్తాను.. ప్రతి ఊరు ప్రతి ఇంటికి వస్తాను.. అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందన్నారు.. టెక్కలి నియోజకవర్గం ప్రజలను తాను ఎప్పుడు మర్చిపోను అన్నారు.. నా ఊపిరి ఉన్నంతవరకు నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షంగా పనిచేస్తాను అని ప్రకటించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్..