వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై సీఎం సమీక్ష.. 11 రంగాలపై ఫోకస్..
సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ‘మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఫోకస్ పెట్టింది.. మున్సిపల్, వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్ధాల నుంచి సర్క్యులర్ ఎకానమీ సృష్టించేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. వీటికి అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం.. నగర పాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేస్తోంది ఏపీ సర్కార్..
హెడ్ కానిస్టేబుల్ లేఖపై స్పందించిన సిట్.. కీలక విషయాలు వెల్లడి..
ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెల్లడించింది.. బలవంతంగా వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖపై క్లారిటీ ఇస్తూ.. మద్యం స్కాం కేసులో ముడుపులు ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయి.. గత ఎన్నికలలో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్టు తెలిసింది.. విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది.. కానీ, విచారణకు సహకరించకుండా అధికారుల పేర్లు రాసి చనిపోతానని మదన్ బెదిరించాడని వెల్లడించింది.. ఇక, సిట్ పారదర్శకంగా విచారణ చేస్తోంది.. ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది.. ఎప్పుడూ ఈ ఆరోపణలు రాలేదని తెలింపింది సిట్.. మదన్‌రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశాడు.. దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది.. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ ను సిట్ నిర్బంధించినట్టు హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే సిట్ ను బలహీన పరిచి అధికారులపై ఒత్తిడి తెచ్చే కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.. మదన్ రెడ్డి ఆరోపణలు అవస్తవమైనా.. విచారణ చేయాలని డీజీపీని కోరతాం.. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలని కోరాం.. సిట్ ఎవరి బెదిరింపులకు లొంగదు.. స్కాంలో తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది సిట్..
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయి..
గత ప్రభుత్వం హయాంలో రైతులు వాడిన విద్యుత్ కు పెద్ద ఎత్తున బకాయిలు పెట్టిన వాటిని కూడా ఈ ప్రభుత్వం చెల్లించి.. ఉచిత కరెంటు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి.. 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయని తేల్చి చెప్పారు. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చుపెట్టింది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వమే.. ఐదేళ్లలో మూడు లక్షల 50 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చెప్పబోతున్నాం.. ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చుపెట్టిన ప్రభుత్వం దేశంలో ఏక్కడ లేదు.. రూ. 500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నాం.. రాష్ట్రంలో పారిశ్రామికంగా, సంక్షేమ పరంగా, వ్యవసాయ లాంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు బయటకి వచ్చినప్పుడు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఆలోచన చేస్తుంది.. గతంలో సంపాదించిన ప్రతి రూపాయిని దోచాలని ఆలోచనతో ఉండేవాళ్లు అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ప్రజల స్థితిగతుల్లో మార్పు జరగలేదు అన్నారు. ఇది గమనించిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి అధికారంలోకి తీసుకొచ్చారని వెల్లడించారు. రూ. 38 వేల కోట్ల నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లకు పెంచి.. అందిన కాడికి దోచుకున్నారు.. ఆ ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయింది అని భట్టి పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం.. అభివృద్ధి చేసి చూపిస్తాం..!
భూపాలపల్లిలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. జిల్లాలోని గోరికొత్త పల్లి మండలం చెన్నాపూర్ లో కోటి 40 లక్షలతో సబ్ స్టేషన్ ప్రారంభం చేసుకున్నామన్నారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా రూ.8 కోట్ల వ్యయంతో 33/11 కేవీతో మంజూరు నగర్, ధర్మారావు పేట, నవాబుపేటలలో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని వెల్లడించారు. అలాగే, దీర్ఘకాలికంగా సమస్య లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదన్నారు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతరాయం కలగకుండా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 6 హామీలలో భాగంగా రాష్ట్రంలో 50 లక్షల మందికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తేల్చి చెప్పారు. జిల్లాలో 47 వేల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం.. 46 వేల వ్యవసాయ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
పెళ్లికి ఒక రోజు ముందు వరుడి దారుణహత్య.. వధువు “లవ్ ఎఫైర్” కారణం..
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భర్తల్ని చంపడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. పలువురు మహిళలు తమ భర్తల్ని చంపుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో భార్య సోమన్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో ఒక వరుడిని పెళ్లి ముందు రోజు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 15న జరిగింది. వరుడి గ్రామం ధన్‌పూరాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితుడికి, మృతుడికి కాబోయే భార్యతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాంపూర్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు సద్దాంను సోమవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన నిహాల్ మొబైల్ ఫోన్‌ని దాడిపెట్టినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. నిహాల్ 15వ తేదీన హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత, కొత్వాలి గంజ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నిహాల్ మొబైల్ స్వాధీనం చేసుకునే క్రమంలో, సద్దాం పోలీసుల వద్ద నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు సద్దాం గాయపడ్డాడు.
‘‘నువ్వు ఒక పిరికిపంద, నీకు సిగ్గులేదు’’.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఘోర అవమానం..
‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. అయితే, ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్ కాదు ఫేయిల్డ్ మార్షల్’’ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా, ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాషింగ్టన్‌లో మునీర్ ఉంటున్న హోటల్ ముందు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి, అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి ఆసిమ్ మునీర్ అడ్డుగా ఉన్నాడని ఆరోపించారు. హోటల్ భవనం నుంచి పాక్ ఆర్మీ చీఫ్ బయటకు వెళ్తుండగా ప్రజలు ‘‘ఆసిమ్ మనీర్ నువ్వు పిరికివాడివి, నీకు సిగ్గులేదు, సామూహిక హంతకుడివి, నువ్వు నియంత’’ అంటూ నినాదాలు చేశారు.
మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!
వన్ ప్లస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి జూలై 8న భారతదేశంతో పాటు ఇతర దేశాల గ్లోబల్ మార్కెట్ల కోసం సమ్మర్ లాంచ్ ఈవెంట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో OnePlus Nord 5, OnePlus Nord CE 5, OnePlus Buds 4 లాంచ్ చేయనున్నారు. మరి కొత్తగా విడుదలకానున్న ఈ మొబైల్స్, ఇయర్‌బడ్స్ వివరాలను చూసేద్దామా.. OnePlus Nord 5: ఇది Nord సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఎంట్రీ మొబైల్. OnePlus Nord 5 ఫోన్‌లో Snapdragon 8s Gen 3 Mobile Platform ప్రాసెసర్‌ను వినియోగించనున్నారు. ఇది Nord సిరీస్‌లో మొదటిసారి Snapdragon 8 సిరీస్‌కి చెందిన చిప్‌సెట్‌ను వాడనున్న మొబైల్. ఈ ఫోన్ LPDDR5X RAMతో రానుంది. ఫోన్ టీజర్ ప్రకారం, దీని రియర్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు అలాగే వాటి క్రింద LED ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇటీవల చైనా మార్కెట్లో వచ్చిన OnePlus Ace 5 Ultra Edition డిజైన్ లా కనపడుతుంది.
యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్
మళయాల భామ అనుపమకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ పరంగా అదరగొట్టేస్తుంది ఈ బ్యూటీ. అందం, నటన, డ్యాన్స్.. మూడింటిలో ఈ బ్యూటీకి తిరుగులేదు. అలాంటి అనుపమను నటన రాదంటూ ట్రోల్ చేశారంట. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఇలాంటివి ఎక్కువగా కనిపించాయి. సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. నిజంగానే నాకు యాక్టింగ్ రాదేమో అనుకుని బాధపడ్డాను. అలాంటి టైమ్ లో నన్ను ప్రవీణ్ నమ్మారు. జానకి వర్సెస్ కేరళ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ మూవీతో నాకు ప్రశంసలు వచ్చాయి. అప్పుడే నాకు ఒకటి అర్థం అయింది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తే ఇలాంటి ట్రోల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అప్పటి నుంచే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నా. ఒకప్పుడు ట్రోల్ చేసిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.
పేరు మార్చుకున్న సంయుక్త?
హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీమ్లా నాయక్ వంటి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత పలు అవకాశాలు అందుకుంది. ఒకవిధంగా ఆమెకు ఇప్పుడు లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించింది. అందుకే ఆమెతో సినిమా చేయించేందుకు మన నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె డైరీ చాలా బిజీగా ఉంది. ఒకవైపు నందమూరి బాలకృష్ణతో అఖండ 2 చేస్తూనే, మరోవైపు స్వయంభు, అదేవిధంగా తమిళంలో బెంజ్, హైందవ, నారి నారి నడుమ మురారి అంటూ వరుస సినిమాలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఆమె పేరు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే, తాజాగా ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇంకా ఫిక్స్ చేయలేని, కానీ దాదాపు బెగ్గర్ అనే టైటిల్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు.
కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బతినే విధంగా చరిత్ర, పురాణాలు, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల తరువాత హైకోర్టు నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు 17 జూన్ మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. ఈ క్రమంలో సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరఫున అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. వారి తరపున ఉన్న అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్ని అవరోధాలు అయినా సరే ఈనెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయస్థానం ముందు ఉంచారు.