AP Liquor Scam Case: ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీజీపీకి లేఖ రాసిన మదన్ రెడ్డి.. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేశా.. లిక్కర్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాం కేసులో కీలక విషయాలు వెల్లడించింది.. బలవంతంగా వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారని.. వినకపోతే దాడి చేస్తున్నారన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖపై క్లారిటీ ఇస్తూ.. మద్యం స్కాం కేసులో ముడుపులు ఏ1 రాజ్ కేసిరెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయి.. గత ఎన్నికలలో ప్రజలకు ఈ డబ్బు చెవిరెడ్డి పంచినట్టు తెలిసింది.. విచారణలో భాగంగా చెవిరెడ్డి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది.. కానీ, విచారణకు సహకరించకుండా అధికారుల పేర్లు రాసి చనిపోతానని మదన్ బెదిరించాడని వెల్లడించింది..
Read Also: Anupama Parameshwaran : యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్
ఇక, సిట్ పారదర్శకంగా విచారణ చేస్తోంది.. ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది.. ఎప్పుడూ ఈ ఆరోపణలు రాలేదని తెలింపింది సిట్.. మదన్‌రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశాడు.. దీని వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది.. చెవిరెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ యాదవ్ ను సిట్ నిర్బంధించినట్టు హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే సిట్ ను బలహీన పరిచి అధికారులపై ఒత్తిడి తెచ్చే కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.. మదన్ రెడ్డి ఆరోపణలు అవస్తవమైనా.. విచారణ చేయాలని డీజీపీని కోరతాం.. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలని కోరాం.. సిట్ ఎవరి బెదిరింపులకు లొంగదు.. స్కాంలో తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది సిట్..
Read Also: POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!
కాగా, ఏపీ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి సంచలన లేఖ రాశారు.. సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీకి లేఖ రాసిన మదన్ రెడ్డి.. పదేళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేశా.. లిక్కర్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు.. నా కంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారు.. విచారణకు యూనిఫామ్‌లో వెళ్లనందుకు నన్ను తిట్టారు.. చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పామన్నారు.. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనందుకు నాపై సిట్ అధికారులు దాడులు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరుకాలేను అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి..