BV Raghavulu: ఇరాన్‌తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన వివిధ అంశాలపై స్పందించారు.. పెహల్గామ్ లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలకు వివరించడానికి వారం రోజులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడిచేసి ధ్వసం చేసింది.. మరి, పాకిస్ధాన్, ఇండియా మధ్య యుద్ధం ఆపింది నేనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు.. దీంతో, కేంద్రం ఏదో దాస్తుంది అనే అనుమానం కలుగుతుందన్నారు.. ఇజ్రాయిల్, ఇరాక్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపుతామంటూ ట్రంప్ ప్రకటించారని గుర్తుచేశారు..
Read Also: Vijayawada: భర్త కొడుతున్నాడని 112 కు ఫోన్ చేసిన మహిళ… చివరికీ..
ఇక, గతంతో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేసుకోవాలి.. నాటి పరిస్థితికంటే మరింత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు బీవీ రాఘవులు.. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్న ఆయన.. ఇరాన్.. ఇజ్రాయిల్‌పై దాడి చేసింది.. ఈ యుద్దం తీవ్రమైతే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు దెబ్బతగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. యుద్ధం నుండి వెనక్కి తగ్గాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి తీసుకుని రావాలని సూచించారు.. ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు.. ఇరాన్ తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.. ఇజ్రాయిల్ దాడిని భారత్ ఖండించాలి.. ఇప్పటికే 10శాతం క్రూడాయిల్ ధరలు పెరిగాయి.. భారత్ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అయితే, అమెరికా చెప్పిన విధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. పార్లమెంట్ సమావేశాలు వేసి ఈ అంశాలపై చర్చించాలి.. పార్లమెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటనగా భావిస్తాం.. పార్లమెంట్ మీద ఇంకా నమ్మకం పోలేదన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..