ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం.. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్.. రాజేంద్ర నాథ్రెడ్డి.. హరీష్ కుమార్ గుప్తా.. కుమార్ విశ్వజిత్.. సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది ఏపీ సర్కార్..
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఈ రోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.. దీంతో, 24 రోజుల ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అయితే, ఇతర కేసుల్లో బెయిల్ మంజూరు అయినా.. పోసానికి సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు.. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు పోసాని కృష్ణ మురళి.. అయితే, పోసాని వ్యవహారం 30 ఫిర్యాదులు.. 17 కేసులు..…
ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.
ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ.. గుంటూరు జిల్లా జైలు నుంచి ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు విడుదలయ్యారు పోసాని కృష్ణమురళి.. జైలు బయట పోసానిని కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు.. మంత్రి నారా లోకేష్ చెప్పటం వల్లే మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు బయటకు వదలకుండా ఆపారు.. లోకేష్ కనుసన్నలలో అంతా నడుస్తుందని ఆరోపించారు..
ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు జలభద్రపురాన్ని వణికిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు కలకలం సృష్టిస్తున్నారు.. గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
మూడో జాబితాలో మరికొన్ని కీలక పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్.. దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి చేశారు.. 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా సిద్ధం అవుతోందట.. చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు రాగా.. ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు సాగుతున్నాయి.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్..
ఓ చిన్నోడికి మాత్రం.. ఏకంగా పవన్ కల్యాణ్ భుజనాలను ఎక్కే అవకాశం దక్కింది.. పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఆ సభలో ఓ పిల్లాడు.. ఎర్ర టవల్ తలకు కట్టుకుని కనిపించాడు.. దీంతో, ఆ బుడ్డోడిని స్టేజిపైకి రప్పించిన పవన్.. అతనని భుజంపై కూర్చోబెట్టుకుని ముద్దాడు..