పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్.. 2023 - 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు..
ఈ నెల 27వ తేదీన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది.. ఈ సమయంలో నాటకీయ పరిణాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ఆళ్ల ఆంజనేయరెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.. ఫిర్యాదు ఆధారంగా ఎంపీపీ అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సుబ్బారావుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అటెంప్ట్ మర్డర్ కేసు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
ఉగాది మహోత్సవాలు సమీపిస్తుండడంతో మల్లన్న ఆలయానికి కన్నడ భక్తజనం బారులు తీరారు. అయితే, ఉగాది మహోత్సవాలకు వారం ముందు నుంచే కన్నడ భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. దానికి తోడు ఈనెల 26 వరకు మాత్రమే కన్నడ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు.
ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని.. ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వడగళ్ల వాన పడుతుందని పేర్కొంది..
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ... తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు?
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై ఉత్తరాది.. దక్షిణాదిల మధ్య గంభీరమైన వాతవరణం నెలకొంది. చెన్నై కేంద్రంగా డీఎంకే ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి సౌత్ సీఎంలు, పలు రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ప్రతినిధులు వైసీపీని కూడా ఆహ్వానించారు. జగన్ గతంలో ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతు పలికాయి.
బీసీ రిజర్వేషన్స్ బిల్లు విషయమై తెలంగాణ బీజేపీ తడబడిందన్న వాదన బలపడుతోంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. దీనిపై కాస్త గట్టి చర్చే జరుగుతోందట. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై అభ్యంతరం చెబుతూ వస్తోంది కాషాయ దళం. తాము అధికారంలోకి వస్తే.... ఆ కోటాను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది.