RK Roja: కుప్పం ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా…? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు అన్న సీఎం చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతాడు…? అని నిలదీశారు ఆర్కే రోజా..
Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
నీ సొంత (కుప్పం) నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరేం చర్యలు తీసుకున్నారు.. అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు రోజా.. తెలుగుదేశం పార్టీ నేత ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టాడు.. ఆ తెలుగుదేశం పార్టీకి నేతకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ? చంద్రబాబు అన్నా.. హోమ్ మంత్రి అన్నా.. వారి పార్టీ కార్యకర్తలకే భయం లేదని విమర్శించారు.. ఎంత హింస చేస్తే అంత మంచి పదవి అని.. లోకేష్ చెప్పడంతో అంతా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. అనంతపురంలో 14 మంది టీడీపీ నేతలు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు… కనీసం పరిటాల సునీత ఆ అమ్మాయి పరామర్శించలేదు.. కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు.. హోం మంత్రికి ఎంత అహంకారం ఉంటే బాధితురాలిని వీడియో కాల్ ద్వారా పరామర్శిస్తుంది…? అని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత.. ఇలా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..