CM Chandrababu: పుష్ప-2 సినిమాలోని ‘రప్పా.. రప్పా..’ డైలాగ్ ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్‌ను తాకింది.. ‘అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం’ అంటూ పల్నాడులో ఓ యువకుడు ప్లకార్డు ప్రదర్శించడం దీనికి మూల కారణం కాగా.. ‘పుష్ప’ సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించడంపై సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.. ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.. ఒకప్పుడు నేరస్తుల తో దూరంగా ఉండేవారం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజాకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు..
ఎవరైనా పోలీసులను తిడతారా..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. ఏ పార్టీ అయినా ఇలాంటి ఒరవడి ఉందా? జగన్ కు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు. వెధవ పనులు చేస్తే 11 ఇచ్చారు కదా? పోలీసులు చెప్పాక ఎవరైనా వెళ్తారా.? ఇరుకు సందుల్లో పోయి.. తొక్కిసలాట కు పాల్పడతారా..? ఒక పద్ధతి హుందాతనం నాయకుల కు ఉండాలని హితవు చెప్పారు.. ఇక, ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ లు ఉండవు.. ఇసుక, లిక్కర్ లో ఏమి జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు సీఎం.. హత్యలు, అత్యాచారం చేసే వాళ్లకి విగ్రహాలు పెడతారా..? లా అండ్ ఆర్డర్ పాటించే వాళ్లని నెగెటివ్ గా చూస్తూన్నారని దుయ్యబట్టారు.. అయితే, గంజాయి వాడితే మక్కేలు విరగ్గొడతా? అని వార్నింగ్ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయా లేదా? మరి యాక్షన్ ఉండొద్దా..? అని నిలదీశారు.. ఎమ్మెల్యే లు ఇంటిటికి వెళ్ళినప్పుడు. ప్రజలు అడిగితే సమాధానం చెప్తా.. వైసీపీ అడిగితే మాత్రం తాట తీస్తాం అని హెచ్చరించారు.. పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమనాలి.. నన్ను వైజాగ్, తిరుపతిలో ఆపేశారు. ఏమన్నాను… ఏమైనా చేసానా..? గొడవ చేసి.. ఈ ప్రభుత్వం పనికి రాదు అని చెప్పడానికా? 40 వేల మందిని మార్కెట్ యార్డ్ కు ఎలా తీసుకు వెళ్తారు? పొగాకు మార్కెట్ యార్డ్ కు 40 వేల మందిని తీసుకు వెళ్తారా? అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నా.. కానీ, నిజాలు బయటకు రావాలి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..