CM Chandrababu: పొగాకు రైతుల ఇబ్బందులపై అధికారుతో చర్చించారు సీఎం చంద్రబాబు. పొగాకు కొనుగోలు, మార్కెటింగ్‌పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు సీఎంకు తెలిపారు అధికారులు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు.
Read Also: Gayatri Mantra: గాయత్రీ మంత్రంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. వీడియో వైరల్
బాపట్ల జిల్లాలో -3, గుంటూరులో 2, పల్నాడు జిల్లాలో -1, ప్రకాశం జిల్లాలో ఒక కొనుగోలు పొగాకు కేంద్రం ప్రారంభించారు. వీటి ద్వారా ఈ నెల 19నుంచి కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతీ పొగాకు రైతుకు అందించాలని సీఎం ఆదేశించారు. పామ్ ఆయిల్‌పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని చంద్రబాబు తెలిపారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు సీఎం.
Read Also: Realtor Murder Case: రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
ప్రస్తుతం మామిడికి కిలోపై రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో 12 వేల మెట్రిక్ టన్నుల మేర కోకో ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపోందించాలని చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.