Revenue Day: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.. దీని కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున రూ.52 లక్షలు రెవెన్యూ డేకు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. రెవెన్యూ డే సందర్భంగా ప్రతీ రెవెన్యూ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు.. రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి..
Read Also: IND vs ENG: ఇంగ్లాండ్‌కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మ్యాచుల షెడ్యూల్ ఇలా..
రెవెన్యూ దినోత్సవ వేడుకలపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రేపు జరిగే రెవెన్యూ దినోత్సవాన్ని జయప్రదం చేయండి అంటూ పిలుపునిచ్చారు.. ప్రతి ఏటా జూన్ 20వ తేదీన అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో రెవెన్యూ దినోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ప్రజలకు, రైతులకు భూ సంబంధ అంశాలపై అవగాహన కల్పిస్తామని.. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి సలహాలు స్వీకరిస్తామన్నారు.. ఇక, ఉత్తమ సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు ఈ సందర్భంగా సన్మానం చేస్తామని పేర్కొన్నారు.. బాగా పని చేసిన రెవెన్యూ ఉద్యోగులను గుర్తించి కమేండేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తాం.. రెవెన్యూ దినోత్సవంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు ఏపీ రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్..