CM Chandrababu: 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా కార్యక్రమం, ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగ పై ప్రజల్లో ఇంట్రెస్ట్ వచ్చింది.. 1 కోటి 5 లక్షల 58 వేలకు పైగా అంతర్జాతీయ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఇండియా మొత్తంలో 8 లక్షల లోకేషన్ లలో యోగాలో పాల్గొంటారు. యోగాను ఉద్యమ స్ఫూర్తిగా తీసుకున్నారు. మూడు లక్షల 19 వేల మంది సింగిల్ లోకేషన్ లో వైజాగ్ లో యోగ చేస్తారు.. 3 లక్షల 50 వేల మంది వస్తారు.. 9 వేల వాహనాలు అందుబాటులో ఉంచాం.. 75 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.. 4 వేల టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం.. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ అందుబాటులో ఉంటుంది.. 5 లక్షల టీషర్ట్‌లు.. 5 లక్షల యోగ మ్యాట్ లు అందుబాటులో ఉంటాయి అని వెల్లడించారు..
Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..
ఇక, యోగ కోసం వచ్చే వారికి కంపార్ట్ మెంట్ వారీగా ఇంఛార్జిలను పెడుతున్నాం.. యోగాకు సంబంధించి స్టార్టప్ లు వస్తున్నాయి.. యోగా మ్యాట్ పై ప్రాక్టీసు చేస్తే ఎంత టైం చెయ్యాలి.. ఏ వ్యాధికి ఎలా యోగ చెయ్యాలి అనేది స్టార్టప్ లు వచ్చాయి.. క్వామ్ టామ్.వ్యాలీ.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలిసి పని చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు.. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్ పై అవగాహన కల్పిస్తాం. అవసరం అయితే యోగా కోసం నాన్ ప్రాఫిట్ సంస్థ ఏర్పాటు చేస్తాం.. యోగా చేసే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం. ప్రజా హితం కోసం యోగా అన్నారు.. యోగాకు మతం లేదు.. యోగా అంటే సైన్స్ అని స్పష్టం చేశారు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫాస్టింగ్ చేస్తారు.. శనివారం ఉపవాసం చేసేవారు. దేవుడు కి ప్రార్ధన చేసి భోజనం చేసేవారు.. హెల్త్ అంటే సైన్స్.. కార్బోహైడ్రేట్లు తిని షుగర్ రావద్దంటే ఎలా..? అని ప్రశ్నించారు..
Read Also: Pakistan: “డొనాల్డ్ ట్రంప్- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..
అంతర్జాతీయ యోగా డేలో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఎక్కువ ఆసనాలతో యోగాలో పాల్గొనడం.. సూర్య నమస్కారాలు ఈ రెండిటిలో గిన్నిస్ బుక్ రికార్డులకు పంపుతున్నాం. అరకు పాడేరు నుంచి వచ్చి సూర్య నమస్కారాలు చేస్తారు. సరిగ్గా అంతర్జాతీయ యోగా డే సరిగ్గా ఉదయం 7 గంటలకు మొదలు అవుతుంది. సరిగ్గా గంటసేపు జరుగుతుంది. యోగా నేచురోపతి. డీమ్డ్ యూనివర్సిటీ పెట్టడంపై ఆలోచన చేస్తున్నాం.. ఇప్పటికే మనకు మంతెన సత్యనారాయణ రాజు. ప్రకృతి ఆశ్రమం ఉంది…. ఆ దిశగా ఆలోచన చేస్తాం అన్నారు.. యోగా మన జీవితంలో భాగం కావాలి.. రాష్ట్రమంతా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 9వ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు. భవిష్యత్తులో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ శిక్షణ, కోర్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. గత నెల 21 నుంచి ఈనెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యోగాంధ్ర కోసం 2 కోట్ల మందిని టార్గెట్ పెట్టుకుంటే లక్ష్యానికి మించి 2.39 కోట్లమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..