Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటికే అరెస్ట్ అయిన కాకాణిపై పలు కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి.. వసూళ్లకి పాల్పడిన కేసులో జులై 3వ తేదీ వరకు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.. ఇప్పటికే మూడు కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి ఉండగా.. ఇప్పుడు నాలుగో కేసులో కూడా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు..
Read Also: Formula E Case: కేటీఆర్ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించనున్న ఏసీబీ..?
అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డిని బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.. ఇక, అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకాణిపై సీఐడీ కేసు నమోదు చేయగా.. దీంతో పీటీ వారెంట్‌పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కాకాణిని సీఐడీ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.. ఇలా వరుసగా వివిధ కేసుల్లో రిమాండ్ లో ఉండగా.. తాజాగా ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి.. వసూళ్లకి పాల్పడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు.