MLA Parthasarathy Apology: కర్నూలు జిల్లా ఆదోనిలో దళిత సర్పంచ్ ఘటనలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.. దళిత సంఘాల మధ్య బహిరంగ క్షమాపణ కోరారు పార్థసారథి.. రెండు రోజుల క్రితం దనాపురంలో దళిత సర్పంచ్ కి అవమానం జరిగింది.. ప్రజల కోసం మీ పార్థసారథి ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచ్ కి అవమానం జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అయితే, సర్పంచ్ ని ఎమ్మెల్యే వేదికపై పిలుస్తుండగా అతను ఎస్సీ, ఎస్సీ అని.. ఎమ్మెల్యే పార్థసారథికి చెప్పారు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ… దీంతో, సర్పంచ్ ఎస్సీ అని వేదికపైకి రాకుండా కిందే ఆగిపోవాలనే సైగలు చేశారు ఎమ్మెల్యే పార్థసారథి.. సర్పంచ్ చంద్రశేఖర్ ను కింద నిల్చోమని చూపించారు ఎమ్మెల్యే పార్థసారథి… కానీ, సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కిందనే బీజేపీ , టీడీపీ నాయకులు నిలబెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. దీనిపై దళిత సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టారు.. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి..
Read Also: Shashi Tharoor: బీజేపీతో సాన్నిహిత్యంపై నోరు విప్పిన శశి థరూర్.. ఏమన్నారంటే..!
కాగా, తాజాగా కర్నూలు జిల్లాలో దళిత సర్పంచ్‌కు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెట్టసాగారు.. కూటమి ఏడాది పాలన ఈనెల 12న పూర్తిచేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి.. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని మండలం దానాపురంలో గుడి కట్టపై ప్రజల కోసం మీ పార్థసారథి అని పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రొగ్రామ్‌కు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కృష్ణమ్మ కూడా హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎక్కడ అంటూ ఆరా తీశారు. సర్పంచ్ రాకపోవడంతో ఆయన ఏమైనా క్రిస్టియనా? అని ఎమ్మెల్యే అనగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ.. ఎమ్మెల్యే చెవిలో ఎస్సీ అని చెప్పారు. ఇంతలోనే సర్పంచ్ చంద్రశేఖర్ స్టేజి దగ్గరకు వచ్చాడు.. వారు మాట్లాడుతూ ఉండగా కిందనే నిలబడ్డారు. దీంతో, దళిత సర్పంచ్‌కు అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. విపరీతంగా వైరల్ అయ్యింది ఆ వీడియో.. చివరకు ఎమ్మెల్యే పార్థసారథి.. బహిరంగ క్షమాపణ చెప్పి.. ఆ వివాదానికి ముగింపు పలికారు..