CM Chandrababu: బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ మొదలైంది.. ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజం పడింది.. ఆనాడు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.. కానీ, తెలంగాణ ప్రయోజనాల విషయంలో మేం రాజీ పడం అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. తాజాగా బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..
Read Also: Tamil Nadu: ‘‘మురుగన్ సదస్సు’’కు వెళ్లనున్న సీఎం యోగి, పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన డీఎంకే..
హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాక.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంటిన్యూ చేసాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా నీటిపారుదల ప్రాజెక్ట్ లు నేనే మొదలు పెట్టా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కూడా నేను అభ్యంతరం చెప్పలేదు అన్నారు చంద్రబాబు.. సముద్రంలోకి వెళ్లే నీటితో ప్రాజెక్ట్ పై సమస్య ఏంటి? అని ప్రశ్నించారు.. వాదన.. ఏదైనా చెయ్యచ్చు… కానీ, కొట్లాట వల్ల ఉపయోగం లేదు అన్నారు.. గొడవ పడితే ప్రజల్ని మభ్య పెట్టినట్టు.. నేను గొడవ పడితే ప్రయోజనం లేదు అన్నారు.. హైదరాబాద్ వల్ల ఆదాయం వస్తోంది.. నాకు సంతోషం.. హైదరాబాద్.. అమరావతి నా ఉద్యోగం కోసం కట్టానా? అని ప్రశ్నించారు.. బనకచర్ల ప్రాజెక్టు పై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరం అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడతా అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: UP: నేరస్థుల ఏరివేతలో యోగి సర్కార్ రూటే వేరు.. 8 ఏళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు..
కాగా, బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు ఓ సూచన చేస్తున్నా.. మీరు పక్క రాష్ట్ర సీఎం.. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు.. మీరేం చెబితే ప్రధాని నరేంద్ర మోడీ అది వినొచ్చు.. అంతమాత్రాన.. బనకచర్లకు అన్ని అనుమతులు వస్తాయని అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అలాంటి అవకాశం లేదు.. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన మా వద్ద స్పష్టంగా ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు..