దళిత సర్పంచ్‌కు బహిరంగ క్షమాపణ కోరిన ఎమ్మెల్యే పార్థసారథి..
కర్నూలు జిల్లా ఆదోనిలో దళిత సర్పంచ్ ఘటనలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి.. దళిత సంఘాల మధ్య బహిరంగ క్షమాపణ కోరారు పార్థసారథి.. రెండు రోజుల క్రితం దనాపురంలో దళిత సర్పంచ్ కి అవమానం జరిగింది.. ప్రజల కోసం మీ పార్థసారథి ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచ్ కి అవమానం జరిగిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అయితే, సర్పంచ్ ని ఎమ్మెల్యే వేదికపై పిలుస్తుండగా అతను ఎస్సీ, ఎస్సీ అని.. ఎమ్మెల్యే పార్థసారథికి చెప్పారు టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ… దీంతో, సర్పంచ్ ఎస్సీ అని వేదికపైకి రాకుండా కిందే ఆగిపోవాలనే సైగలు చేశారు ఎమ్మెల్యే పార్థసారథి.. సర్పంచ్ చంద్రశేఖర్ ను కింద నిల్చోమని చూపించారు ఎమ్మెల్యే పార్థసారథి… కానీ, సర్పంచ్ ఎస్సీ కావడంతో వేదిక కిందనే బీజేపీ , టీడీపీ నాయకులు నిలబెట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. దీనిపై దళిత సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టారు.. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథి..
రప్పా.. రప్పా నరుకుతారట.. ఎవర్ని ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..?
రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే.. సంతోషం అంటారు జగన్..! ఖండించాలి కదా..? రప్పా.. రప్పా.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..? అని ప్రశ్నించారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించిన పయ్యావుల.. రాష్ట్రంలో రౌడీలు తన వెనక నడవమని జగన్ చెప్తున్నారు.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ లు చేశారు.. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు.. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణుక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు.. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు.. గంజాయి, బ్లెడ్ బ్యాచ్‌ను ప్రోత్సాహిస్తున్నారు.. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి.. రప్పా.. రప్పా నరుకుతాం అంటున్నారని మండిపడ్డారు..
1.29 లక్షల ప్రాంతాల్లో యోగా.. ఇది చరిత్రలో జరగలేదు.. రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నం..
1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా కార్యక్రమం, ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యోగ పై ప్రజల్లో ఇంట్రెస్ట్ వచ్చింది.. 1 కోటి 5 లక్షల 58 వేలకు పైగా అంతర్జాతీయ యోగా డే కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఇండియా మొత్తంలో 8 లక్షల లోకేషన్ లలో యోగాలో పాల్గొంటారు. యోగాను ఉద్యమ స్ఫూర్తిగా తీసుకున్నారు. మూడు లక్షల 19 వేల మంది సింగిల్ లోకేషన్ లో వైజాగ్ లో యోగ చేస్తారు.. 3 లక్షల 50 వేల మంది వస్తారు.. 9 వేల వాహనాలు అందుబాటులో ఉంచాం.. 75 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.. 4 వేల టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం.. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ అందుబాటులో ఉంటుంది.. 5 లక్షల టీషర్ట్‌లు.. 5 లక్షల యోగ మ్యాట్ లు అందుబాటులో ఉంటాయి అని వెల్లడించారు.. అంతర్జాతీయ యోగా డేలో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఎక్కువ ఆసనాలతో యోగాలో పాల్గొనడం.. సూర్య నమస్కారాలు ఈ రెండిటిలో గిన్నిస్ బుక్ రికార్డులకు పంపుతున్నాం. అరకు పాడేరు నుంచి వచ్చి సూర్య నమస్కారాలు చేస్తారు. సరిగ్గా అంతర్జాతీయ యోగా డే సరిగ్గా ఉదయం 7 గంటలకు మొదలు అవుతుంది. సరిగ్గా గంటసేపు జరుగుతుంది.
బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం!
తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, బనకచర్ల ఏ బేసిన్ లో ఉందని సీఎం అడుగుతున్నాడు.. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అని అంటే ఆయనకు అర్థం కావట్లేదు.. అఖిలపక్షం మీటింగ్ ను రాజకీయాలకు వేదికగా మార్చారు అని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టుల ఎక్కడ కట్టారా కూడా తెలియదు.. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ ల గురించి తెలుసుకోవడం అనేది సీఎం తెలుసుకోవాలని సూచించారు. నల్లమల పులిబిడ్డ అని చెప్పే రేవంత్ రెడ్డికి.. అది ఆంధ్రనా, తెలంగాణ నా తెలియదు అని హరీశ్ రావు విమర్శించారు.
సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి..
వరంగల్ లోని పోచమ్మ మైదానం కూడలిలో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తర్వాత మాట్లాడిన కొండా మురళి.. సొంత పార్టీ నేతలని టార్గెట్ చేశారు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. కొండ మురళి పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి మారిండు అని పేర్కొన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు. నాలాగా దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలను పరోక్షంగా విమర్శించారు కొండ మురళి.
ఇరాన్ సుప్రీం లీడర్ తాత మన భారతీయుడే..
మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం ప్రపంచదేశాలను భయపెడుతోంది. అమెరికా జోక్యం ఉండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? అనే అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్, ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్ సుప్రీం లీడర్స్ తాతలు మన భారతీయులే అని చాలా మందికి తెలియదు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి నాయకత్వం వహించిన ఆయతుల్లా రుహెల్లా ముసావీ ఖొమేనీ ఇరాన్‌కి తొలి సుప్రీం లీడర్‌గా పనిచేశారు. రుహెల్లా ఖమేనీ తాత సయ్యద్ ముసావి 19వ శతాబ్ధం ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ బారాబంకీ సమీపంలోని కింతూర్ గ్రామంలో జన్మించారు.
“డొనాల్డ్ ట్రంప్- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ అయ్యారు. వైట్ హౌజ్‌లో ట్రంప్, మునీర్‌కి లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణ సమయంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్ గురించి పాకిస్తాన్‌కి అందరి కన్నా బాగా తెలుసు అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో ఆసిమ్ మునీర్‌తో పాటు ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్‌తో ఆసిమ్ మునీర్ లంచ్ చేయడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజన్లు పాకిస్తాన్, ఆసిమ్ మునీర్ పరువు తీస్తున్నారు. ‘‘ఆసిమ్ మునీర్ తన జీవితంలో ఇంత మంచి భోజనం తినలేదేమో’’ అంటూ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని యూజర్లు హైలెట్ చేస్తున్నారు. ‘‘ట్రంప్, మునీర్ బిర్యానీతో ప్రపంచశాంతికి మధ్యవర్తిత్వం వహిస్తారు’’ అని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఉప్పు కప్పురంబు ట్రెయిలర్.. ఇదేదో బానే ఉందే!
అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండో తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్‌పై రాధిక లావూ నిర్మాణ బాధ్యతలు నిర్వహించగా, అని ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి కలం నుంచి జాలువారిన ఈ కథలో సుహాస్, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మెరవనుండగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జులై 4 నుంచి ప్రైమ్ వీడియోలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్‌తో, ఇంగ్లీష్ సహా 12 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాళ్లకు అన్నీ ఇచ్చేసా.. ఒంటరిగా ఉంటా.. అభిషేక్ బచ్చన్ పోస్ట్..
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నా ఎవరూ స్పందించట్లేదు. వాటిని ఖండించకపోవడంతో ఈ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. పైగా ఇద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడప్పుడు బచ్చన్ చేస్తున్న పోస్టులు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆయన మరో షాకింగ్ పోస్ట్ చేశాడు. నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేసా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కొన్ని రోజులు ఈ సమాజానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. నా కోసం టైమ్ కేటాయిస్తా. నన్ను నేను చాలా కోల్పోయా. నా కోసం అన్నీ తెలుసుకుంటా. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ బ్రేక్ నాకు చాలా ముఖ్యం అంటూ అందులో రాసుకొచ్చాడు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.