జనాభా పెంపుదల పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉంది.. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్పైనే.. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడనుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుందన్నారు.. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. కానీ, ఆ ఆలోచన విరమించుకుని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసిస్తాం అని ఆసక్తికర కామెంట్లు చేశారు..
ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఐఐటీ మద్రాస్ లో "అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025" లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్‌ను ఏప్రిల్ 9వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
ప్రకాశం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది.. పుల్లలచెరువు మండల పరిషత్‌లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది.. ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు.. వైసీపీ ఎంపీటీసీ నాగేంద్రమ్మ భర్త పొలయ్య మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేశారట..
హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ పాస్టర్ రాజమండ్రి శివార్లలో మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించనుంది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.. దీంతో, అసలు వంశీకి బెయిల్ వస్తుందా? మరోసారి షాక్ తప్పదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది..
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపీపై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.. ఇద్దరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.. 2022 ఏప్రిల్ లో రజిని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు..
సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై మంత్రి నారాయణ దృష్టిసారించారు.. తాగు నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?