వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది..
సహజ మరణాలను లాకప్ డెత్లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. సహజ మరణాలను లాకప్డెత్లుగా పేర్కొంటూ కథనాలను వండి - వార్చి, వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు..
తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో... ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు.