World Motorcycle Day: కొందరికి ఎన్ని విలాసాలు ఉన్నా.. మోటార్ సైకిల్‌పై జర్నీ చేయడం అంటే ఎంతో ఇష్టం.. బైక్‌పై వెళ్తూ.. ఆ నేచర్‌ను ఎంజాయ్ చేయడానికి ఎంతో మంది ఇష్టపడతారు.. తమకు విలాసవంతమైన కార్లు ఉన్నా కూడా.. కొందరు బైక్ జర్నీని.. తనకు నచ్చిన బైక్‌పై తిరగడాన్ని ఇష్టపడతారు.. అయితే, జూన్ 21న వరల్డ్ మోటార్ సైకిల్ డేగా జరుపుకుంటున్న సందర్భంగా.. ఒక మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాల్సిన.. భారత్‌లోని ఐదు రోడ్లు జాబితా.. ఆ రోడ్ల స్పెషాలిటీ.. అవి ఎక్కడున్నాయనే విషయాలు మీకోసం.. జూన్ 21న జరిగే ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవాన్ని.. మోటార్ సైకిల్ యజమానులకు వారి బైక్ పట్ల వారి అంతులేని ప్రేమను వ్యక్తీకరించే అవకాశాన్ని ఇస్తుంది. స్వచ్ఛమైన రూపంలో స్వేచ్ఛగా బైక్ జర్నీ ఉంటుంది.. అయితే, ఔత్సాహికులు ఈ అనుభూతికి మరింత దగ్గరగా ఉండటానికి, రైడర్ల కోసం ఉద్దేశించిన రోడ్ల జాబితాను రూపొందించడం జరిగింది.. అదే సమయంలో ఈ జర్నీ ద్వారా వారికి సుందరమైన ప్రకృతి దృశ్యాలు.. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుంది..
Read Also: Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
* సిమ్లా-కాజా: కాజాకు అత్యంత సాధారణమైన.. సిఫార్సు చేయబడిన మార్గం కిన్నౌర్ లోయ గుండా ఉంది.. ఇది సహజ సౌందర్యం కలిగిన రోడ్డు.. ఎత్తైన పర్వతాల యొక్క కలయికను అందిస్తుంది. సిమ్లా నుండి కాజాకు దూరం దాదాపు 421 కిలోమీటర్లు ఉంటుంది.. వాతావరణం మరియు రహదారి పరిస్థితులను బట్టి ప్రయాణానికి 12 నుండి 14 గంటల వరకు సమయం పడుతుంది..

* లేహ్-మనాలి: లేహ్ నుండి మనాలి వరకు మోటార్‌సైకిల్ ప్రయాణం అంటే.. ఒక ఎత్తైన ప్రదేశం నుండి ప్రయాణించే సాహసయాత్రగా చెప్పుకోవచ్చు.. ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇది దాదాపు 470-475 కిలోమీటర్లు విస్తరించి, ఎత్తైన పర్వత మార్గాలను దాటుతూ ముందుకు సాగుతోంది… ఈ మార్గం పూర్తి చేయడానికి సాధారణంగా 7-9 రోజులు పడుతుంది..

* జులుక్ లూప్స్: జులుక్ లూప్‌లను తరచుగా జిగ్‌జాగ్ రోడ్ అని పిలుస్తారు.. భారత్‌లోని సిక్కింలోని ఓల్డ్ సిల్క్ రూట్‌లో ఉన్న 32 హెయిర్‌పిన్ మలుపులు కలిగిన రోడ్డు ఇది.. ఒక సుందరమైన మోటార్‌సైకిల్ ప్రయాణాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ మార్గం దాని అద్భుతమైన దృశ్యాలు మరియు ఉత్కంఠభరితమైన రైడ్ కారణంగా చాలా మంది మోటార్‌సైకిల్ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది.

* పశ్చిమ కనుమలు: పశ్చిమ కనుమల గుండా ఒక ఇష్టమైన మోటార్‌సైకిల్ మార్గం ముంబైలో ప్రారంభమై మహాబలేశ్వర్ వైపు, తరువాత గోవాకు, చివరికి గోకర్ణ మరియు వివిధ తీర పట్టణాల ద్వారా ముంబైకి తిరిగి వస్తుంది. ఈ ప్రయాణంలో అద్భుతమైన హైవేలు, మెలికలు తిరిగిన పర్వత రహదారులను చూస్తాం.. దట్టమైన అడవులు, జలపాతాలు మరియు బీచ్‌ల వెంట సాగుతోంది..

* బందీపూర్ హైవే: బెంగళూరు నుండి బందీపూర్ నేషనల్ పార్క్‌కు మోటార్‌సైకిల్ మార్గం NH275 వెంట ఉంది.. ఇది సుందరమైన దృశ్యాలను అందించే మృదువైన హైవే… ఈ ప్రయాణం దాదాపు 217 కిలోమీటర్లు ఉంటుంది.. దాదాపు 4 గంటల సమయం పడుతుంది… ఇంకేముందు బైక్ జర్నీ లవర్స్.. మొచ్చిన పాట్నర్‌తో.. నచ్చిన బైక్‌పై.. మీ సమయాన్ని బట్టి రైడింగ్‌కి వెళ్లిపోండి..
