Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..
Read Also: Vishnupriya : వామ్మో.. రెచ్చిపోయి అందాలన్నీ చూపించిన విష్ణుప్రియ..
విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల ఆయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన.. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.. 2007 డిసెంబర్27వ తేదీన జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, 2018లో ఈ కేసును పునర్‌విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.. తొలుత సిట్‌కి ఆ బాధ్యతలు అప్పగించిన హైకోర్టు.. సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిది.. దీంతో, విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఈ రోజు హైకోర్టుకు అందజేశారు సీబీఐ అధికారులు..