Venkatarami Reddy: మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైవీఆర్.. నిన్నటి దినం గుత్తి పట్టణంలో టీడీపీ పట్టణ మండల కమిటీ సమావేశాల ఏర్పాటులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. వైసీపీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీనిపై స్పందించిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నామినేషన్లు వేస్తే తోకలు కత్తిరిస్తాం అన్న గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చి బెదిరించి ధోరణితో మాట్లాడితే వాటికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసునని, రాజకీయాలు అంటే మాకు ఏమీ కొత్త కాదని.. ప్రత్యేకంగా గుమ్మనూరు జయరాం గురించి నాకు బాగా తెలుసని.. ఆయన చరిత్ర ఏమో.. ఏ విధంగా పైకి వచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నించేసుకోవాలి.. అలా కాకుండా మా వైసీపీ కార్యకర్తలకు భయపెట్టే ధోరణితో మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హెచ్చరించారు.
Read Also: Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్