Seediri Appalaraju: ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రప్పా.. రప్పా.. డైలాగ్ చుట్టూ తిరుగుతున్నాయి.. తాజాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో యువత పోరు పోస్టర్ ను వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ, కుంబం హరి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kubera : కుబేర మేకింగ్ వీడియో.. ధనుష్ కష్టం చూడండి..
అయితే, వైఎస్ జగన్‌ని మాత్రమే విమర్శించడానికి మీరు ముందుకు వస్తున్నారని పవన్ పై ఫైర్ అయ్యారు అప్పలరాజు… మీరు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయిండి రప్పా.. రప్పా.. అన్న వాళ్లని సమర్థించడమా.. అని పవన్ వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి సీదిరి మండిపడ్డారు. ఎన్ని వేల కోట్లు యువకులకి బాకీ పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు.. పవన్ మంచితనాన్ని చూశారు నా కొడకల్లారా..! ఎంత మంది వైసీపీ గూండాలొస్తున్నారో.. రండి తోలు తీస్తాను నాకొడకల్లారా.. అన్న డైలాగులు నావి కావని.. పవన్ సార్ డైలాగ్ లేనని దెప్పి పొడిచారు.. వీరమల్లులో ఇలాంటి డైలాగులు ఉండవని గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. 2014 కు ముందు చంద్రబాబును చూసి యువకులు మోసపోతే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూసి మోసపోయారని విమర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు..