MP Mithun Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. చిత్తూరులో మాజీ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి సతీమణిని పరామర్శించడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు మనస్థత్వంతోనే మామిడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు.. ఓ పక్క జిల్లా కలెక్టర్ నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తాం, పల్ప్ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. ఫ్యాక్టరీ యజమానులు మాటవినడం లేదన్నారు. రైతులు మూడు రూపాయలకు ఇస్తామన్నా ఫ్యాక్టరీలు నిరాకరిస్తున్నారని విమర్శించారు.. రాష్ట్రంలో రైతు అన్నవాడు ఎవ్వరూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి.. ఇక, ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని అన్నారని మండిపడ్డారు.. వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే.. వారి నుంచి వస్తున్న జనాదరణను చూసి సీఎం చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి..
Read Also: Kuberaa: కొల్లగొడుతున్న ‘కుబేర’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?