మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఆ నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి మాత్రం హాజరుకాలేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు…
యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తపన పడుతున్నారు.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంద్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నతారు.. ఉత్తరాంద్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు..
ఇప్పుడు పైలట్ అవతారం ఎత్తారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఛాపర్ నడిపి ఔరా..! అనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.. ఛాపర్ లో హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు.. సోషల్ మీడియాలో కేతిరెడ్డి షేర్ చేసిన వీడియోలు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలను కూడా గమనించవచ్చు..
భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్నారై, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి..
ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్‌కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు..
వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు..
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే మెజార్టీ పదవుల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూర్చోబెట్టిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది.. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్..