Off the Record: జగన్.. గుర్తు పెట్టుకో.. నిన్ను అధహ్ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు.., నా పార్టీ జనసేనే కాదు.., ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇవి. అయితే, అది పవన్ వల్ల జరిగిందా? లేక ఇతరత్రా అన్ని కారణాలు కలిసి కొట్టాయా అన్నది వేరే సంగతి గానీ… మొత్తం మీద ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 151 నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది ఆ పార్టీ బలం. పవన్, చంద్రబాబు చేతులు కలపడం వల్లే అది సాధ్యమైందన్నది అంతా చెప్పుకునే మాటే. అటు ఎన్నికలకు ముందు వైసీపీని కౌంటర్ చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ… టీడీపీకంటే ఎక్కువగా జనసేన నేతలే ముందుండే వారు. టీడీపీ నాయకులు మాట్లాడినా… స్ట్రాంగ్ కౌంటర్స్ మాత్రం గ్లాస్ పార్టీ వైపు నుంచే పడేవి. కానీ… అదే జనసేన ఇప్పుడు వైసీపీ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటోందన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, దూకుడు పెంచాలని నిర్ణయించింది వైసీపీ. అందుకు తగ్గట్టే వరుస పర్యటనలు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్.
Read Also: Laya : బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..
అయితే… పరామర్శల పేరుతో జగన్ చేస్తున్న యాత్రలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. పొదిలి, తెనాలి, తాజాగా పల్నాడు జిల్లా రెంటపాళ్ల…. ఇలా ఈ మూడు టూర్స్‌లోనూ పరామర్శల సంగతి పక్కనబెడితే…. వివాదాలు ఎక్కువయ్యాయి. రెంటపాళ్ళలో అయితే… పుష్ప సినిమా డైలాగ్స్ వ్యవహారం రచ్చ రచ్చ అయింది. ఇంకా అవుతోంది. అటు పొదిలి, తెనాలి టూర్స్ సందర్భంగా వైసీపీ కేడర్ చేసిన హంగామా కేసుల దాకా వెళ్ళింది. ప్రభుత్వ అధికారులకు వార్నింగ్స్ నుంచి కూటమి నేతలకు హెచ్చరికలదాకా… అంతా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ఉంది కొన్ని వర్గాల్లో. ఇక్కడే మరో కొత్త చర్చ కూడా మొదలవుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ విషయంలో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఉన్న జనసేన నాయకులు… ఇప్పుడు ఈ టూర్స్, ఆ సమయంలో జరుగుతున్న రచ్చ గురించి ఎందుకు స్పందించడం లేదని డౌట్స్ వస్తున్నాయట కొన్ని సర్కిల్స్‌లో. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులే స్పందించి వైసీపీని కౌంటర్ చేసుకుంటున్నారు తప్ప… జనసేన వైపు నుంచి ఆ రియాక్షన్స్ రాకపోవడం వెనక ప్రత్యేక కారణాలుగాని, వ్యూహాలు గాని ఉన్నాయా అన్న చర్చ జరుగుతోందట రాజకీయ వర్గాల్లో. మామూలుగా అయితే… రెంటపాళ్ళ ఎపిసోడ్‌లో జనసేన నేతలు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేవారని, అలా జరక్కపోవడానికి ప్రత్యేక కారణాలు ఉండి ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.
Read Also: PM Modi: మోడీని భోజనానికి పిలిచిన ట్రంప్.. తిరస్కరించిన ప్రధాని.. ఎందుకంటే..?
జనసేన వైపు నుంచి పెద్దల సంగతి పక్కనపెడితే.. ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకులు ఎవ్వరూ రియాక్ట్ అవలేదు. ఇక మరీ బాగోదన్నట్టుగా అప్రజాస్వామిక ధోరణితో మాట్లాజేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి. సినిమాలో చెప్పే డైలాగ్స్ థియేటర్ వరకు బాగానే ఉంటాయిగానీ… వాటిని ఆచరణలో పెడతామంటే… ప్రజాస్వామ్యంలో సాధ్యంకాదంటూ పవన్ పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ. దీన్నే గతానికి, ప్రస్తుతానికి పోల్చి చూసి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఇదే ఏడాది క్రితం అయితే… జనసేన పెద్దలు ఆవేశంతో ఊగిపోయేవారని, ప్రస్తుతం కామ్‌గా ఉండటం వెనక అది మా సబ్జెక్ట్ కాదని అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. వైసీపీ విషయంలో జనసేన తీరు మారిందా? లేక ఇతరత్రా బలమైన కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే…. పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించి వైసీపీకి కౌంటర్స్ వేసే వారని, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, చేతిలో పవర్ ఉంది… అయినాసరే… జనసేన వైపు నుంచి ఒక పేపర్ స్టేట్‌మెంట్ తప్ప… పెద్దగా రియాక్షన్స్ లేకపోవడాన్ని కాస్త ప్రత్యేకంగానే చూడాలన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇదే సమయంలో మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. వైసీపీ చర్యలకు అదేస్థాయిలో రియాక్షన్స్ ఇస్తే… వివాదం పెరిగి శాంతిభద్రతల సమస్యలకు దారి తీస్తుందని, అంతిమంగా అది స్టేట్ ఇమేజ్, కొత్త పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని, ఇలా… రకరకాల కోణాల్లో ఆలోచించే కాస్త సంయమనం పాటిస్తుండవచ్చన్నది ఇంకో వెర్షన్. కారణం ఏదైనాగానీ… ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల మీద జనసేనాని మౌనం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.