Pawan Kalyan: సేనతో సేనాని సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ రాజకీయాలపై కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో పార్టీని ప్రారంభించి, ఏపీలో సున్నా నుంచి ఒక్కటి, ఒక్కటి నుంచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం జనసేన నిజమైన విజయం అన్నారు. జనసేనకు జాతీయవాద లక్షణాలు ఉన్నాయని, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కోరుతున్నారు అని చెప్పారు ఆయన. పార్టీ బలోపేతం కోసం మీరు పోరాటం చేయాలి. నేను సైద్ధాంతిక బలం ఇస్తాను. మీరు బలపడితే జనసేన తప్పకుండా జాతీయ పార్టీగా మారుతుంది అన్నారు. ఈ రోజు అది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ, ప్రజల మద్దతు ఉంటే నిజమవుతుంది అని పవన్ స్పష్టం చేశారు. ఒక కులం కోసం అయితే కుల నాయకుడినే అయ్యేవాడినని, కానీ, ప్రజా నాయకుడిగా అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇక బీఆర్ఎస్‌పై చేసిన పవన్ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. టీఆర్‌ఎస్ తెలంగాణ వాదంతో ప్రారంభమైంది. కానీ, ఆ భావజాలానికి పరిమిత కాలమే ఉంది. అందుకే అది భారత రాష్ట్ర సమితి అయింది. మరింత మెరుగుపడటానికి మార్పు అనివార్యం అన్న పవన్.. విశాఖలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో చేసిన ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇలా పవన్ పార్టీ కీలక సమావేశాల్లో అందరి ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పవన్ పొలిటికల్ ప్రయాణం పై కొత్త డిస్కషన్స్ మొదలయ్యాయి..
Read Also: Pawan Singh : సజీవదహనమే దిక్కు అంటూ..ఊహించని షాక్ ఇచ్చిన పవన్ సింగ్ భార్య జ్యోతి
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదేపదే జనసేనకు సంబంధించి జాతీయ వాద వ్యాఖ్యలు చేస్తున్నారు.. జనసేనకు జాతీయవాదం లక్షణాలు ఉన్నాయని భవిష్యత్తులో ఏం చేయాలో తన దగ్గర పెద్ద ఎజెండా ఉందని చెబుతున్నారు డిప్యూటీ సీఎం పవన్.. జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓడిపోవడం తర్వాత గెలవడం తిరిగే అధికారంలోకి రావడం కుటుంబం గా ఏర్పడి అధికారంలోకి రావడం జరిగింది.. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు.. తన పార్టీకి జాతీయవాద లక్షణాలు ఉన్నాయని అందుకు తగ్గట్టుగా కార్యాచరణ తన దగ్గర ఉందని పవన్ చెబుతున్నారు.. ఎందుకు పవన్ కళ్యాణ్ జాతీయ వాదం అని పదే పదే చెబుతున్నారు.. దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ బలంగా జరుగుతోంది.
Read Also: LPG Price Reduction: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ల ధర..
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్తులో జాతీయస్థాయిలోకి ఎదగాలి అనుకుంటుంది.. అందులో ఎలాంటి తప్పులేదు.. కానీ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ NDA కూటమిలో ఉన్నారు.. ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు అంటే జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నారు.. అయినా, కూడా ఇంకా జనసేన జాతీయ వాదానికి ప్రాధాన్యపిస్తూ జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్తున్నారు.. దీంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్తులో తన పార్టీని బీజేపీ వైపు తీసుకెళ్లే ఆలోచన ఏదైనా ఉందా ? అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది.. అంటే జనసేనను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా? అని అభిప్రాయాలు కూడా ప్రధానంగా కొన్ని వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.. ఇప్పటికే 15 ఏళ్ల పాటు పొత్తు ఉండాలని చెప్తూ ఉన్నారు. దీనికి తోడు కొత్తగా జాతీయవాదం యాడ్ చేసారు.. సడన్ గా జాతీయవాద ప్రస్తావన ఎందుకు వచ్చింది.. పవన్ కల్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది.. మరి పవన్ మనసులో ఏముందో.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి అనుకుంటున్నారు.. అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి నెలకొంది..