Supreme Court: స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తెలంగాణలో వరుసగా 9 , 10, 11, 12 తరగతులు చదువుతేనే లోకల్ అంటూ తీర్పు వెలువురించింది సుప్రీంకోర్టు.. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్టు అయ్యింది.. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. ఇంటర్మీడియట్ కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 33ని సమర్ధించింది సుప్రీంకోర్టు.. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో వాదించింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపులతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని సూచించింది సుప్రీంకోర్టు.. ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు వర్తించనుంది లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు.. ఇక, ఈ సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం..
Read Also: Pawan Kalyan: జాతీయ పార్టీగా జనసేన..! అసలు పవన్ కల్యాణ్ టార్గెట్ ఏంటి..?